సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘లూసీ’ షూటింగ్ పూర్తి, టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర పూజారి

విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘లూసీ’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది.

సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అండాలమ్మ పిక్చర్స్ సమర్పిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, టాలీవుడ్‌లో అత్యంత చిన్న వయసులో చదువును కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగంలో నిర్మాత గా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలనే లక్ష్యంతో వరుస సినిమాలను నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. యువతకు స్ఫూర్తిగా నిలిచేలా విద్యతో పాటు సినీ నిర్మాణాన్ని సమతూకంగా కొనసాగించాలని ఆయన సంకల్పించారు.

మహదేవ్ చిరంజీవి కథ, దర్శకత్వం వహించగా, ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక విభాగంలో MC సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, వియాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగేష్ అడపా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్, విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయి. సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘లూసీ’ ఒక కొత్త అనుభూతిని అందించనుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

నటీనటులు : చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: సైన్మా స్టూడియోస్
నిర్మాతలు: రాఘవేంద్ర పూజారి
సమర్పణ: ఆండాళమ్మ పిక్చర్స్
కథ, దర్శకత్వం: మహదేవ్ చిరంజీవి
సహ నిర్మాతలు: ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి
డీఓపీ & ఎడిటింగ్: ఎంసీ
సంగీతం: వియాన్ మ్యూజికల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగేష్ అడపా
డీఐ & కలర్ గ్రేడింగ్: ఆర్యన్ మౌళి
డీటీఎస్ మిక్సింగ్: అశోక్
పోస్టర్ డిజైన్: ప్రీతమ్
డిజిటల్ మార్కెటింగ్: వారే మీడియా
పీఆర్‌ఓ: కోయ దినేష్

TFJA

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago