మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య ఈ వేడుక విజయవంతమైయింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా అనిపిస్తుంది. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చూడటం జరిగింది. ఇది గాడ్ ఫాదర్ గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి ” మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్’ అని చరణ్ చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్ నే. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్ తో కలసి మీ అందరూ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది.
ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజ్. మోహన్ రాజా మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్ గా చెప్పారు. రాజా అంత సింపుల్ గా చెప్పారు కానీ అసలు సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం సాధ్యమేనా అని అలిచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. ”నాన్న గారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది” అని చరణ్ చెప్పడం,, ”నేను చేయాలని చిరు గారు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్ కి వచ్చేస్తా’ అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్ కి కృతజ్ఞతలు. చరణ్ తో కలసిసూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి గారు, ఎన్‌వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సప్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు.
ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. మురళి శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి గా శభాష్ అనిపించారు, సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో యూట్యుబర్ గా కనిపించి పాత్రలని కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. వీరంతా కలసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, మస్కులేన్ లుక్స్, ఫైట్స్ తో నా తరపున మీ అందరినీని అలరిస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర. ఇందులో నేను సల్మాన్ ఒక పాట కు డ్యాన్స్ చేశాం. ఇద్దరి స్టార్లని బ్యాలన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. గాడ్ ఫాదర్ కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. కేవలం కంటిచూపుతోని గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు. ఇందులో నజభజజజరా పాటని అద్భుతమైన ఫైట్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుందని హామీ ఇస్తున్నాను. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది.
మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. విజయదశమి మీ జీవితాల్లో కూడా విజయాన్ని తేవాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి. మేము అనుకున్నదానికంటే పదిహేను రేట్లు ఎక్కువ మంది వచ్చి.. ఇంత వర్షం పడుతున్న ఒక్కరు కూడా కదలకుండా ఈ వేడుకని విజయవంతం చేశారు. ఇది కదా నిజమైన ప్రేమ. ఈ ప్రేమనే కదా కోరుకునేది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డానని అంటారు. నన్ను ఇక్కడ నిలబెట్టింది నా అభిమానులు. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్. చాలా నిజాయితీగా చెబుతున్న మాట ఇది. మీరు చూపిన అనంతమైన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లాంటి టైటిల్ కి సరిపోయే ఒకే ఒక్క మనిషి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి. ఈ సినిమా కోసం మూడు పాటలు, రెండు బిట్ సాంగ్స్ రాశాను. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. మోహన్ రాజా గారు చాలా క్లారిటీ వున్న దర్శకులు. తమన్ ఈ చిత్రానికి తన కెరీర్ బెస్ట్ రీరికార్డింగ్ ఇస్తున్నారు. లక్ష్మీ భూపాల ఈ సినిమా కోసం పదునైన మాటలు రాశారు. గాడ్ ఫాదర్ ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది” అన్నారు.
నటుడు షఫీ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లో నటించడం, ఆ అద్భుతమైన సినిమా గురించి మాట్లాడటం మర్చిపోలేని అనుభూతి. చిరంజీవి గారంటే నాకు ప్రేమ భక్తి. ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం ఒక దివ్యానుభూతి. ఆయనతో కలసి పని చేయడంతో నా కల నెరవేరినట్లయింది” అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. మేము అన్నయ్యకి అభిమానులం. అన్నయతో కలసి పని చేయడం మా అదృష్టం. దర్శకుడు మోహన్ రాజా గారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులంతా అద్భుతమైన టెక్నిషియన్స్. ఈ సినిమాలో మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక ఫైట్ చేశాం. అన్నయ్యతో పీక్ ఎమోషనల్ స్టయిలీష్ ఫైట్ చేయించాం. చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరంతా చూడబోతున్నారు. ఈ సినిమాలో అన్నయ్య చాలా కొత్తగా కనిపిస్తారు. అందరినీ అలరిస్తారు” అని చెప్పారు.
ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించింది గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్. దర్శకుడు మోహన్ రాజా, సత్యదేవ్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత లక్ష్మీ భూపాల, చిట్టి, నాగమహేష్ , గెటప్ శ్రీను, తదితరులు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in…
నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ "త్రిముఖ"తో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు, ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య…
ZEE5 లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ ట్రైలర్ విడుదల చేసిన యంగ్ హీరో విశ్వక్ సేన్.. నరేష్ అగస్త్య, మేఘా…
~ Telangana's first detective series, ‘Vikkatakavi’ premieres on November 28 on ZEE5 ~ ~ Produced…
The movie Dhoom Dhaam stars Chetan Krishna and Hebah Patel in the lead roles. Sai…
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్,…