టాలీవుడ్

మ‌హ్మ‌ద్ ముస్త‌ఫా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ‘ముర’ ట్రైల‌ర్ విడుద‌ల‌

*న‌వంబ‌ర్ 8న మూవీ గ్రాండ్ రిలీజ్‌
క్రాష్ కోర్స్‌, ముంబైక‌ర్‌, థ‌గ్స్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన యువ క‌థానాయ‌కుడు హ్రిదు హ‌రూన్, విల‌క్ష‌ణ న‌టుడు సూర‌జ్ వెంజార‌ముడు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన రియల్ రా యాక్ష‌న్ ఫిల్మ్ ‘ముర’. క‌ప్పేల వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు మ‌హ్మ‌ద్ ముస్తఫా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 8న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్.. సోమ‌వారం రోజున మురా సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

సాఫీగా సాగిపోతున్న న‌లుగురు టీనేజ్ కుర్రాళ్ల జీవితం..ఓ వ్య‌క్తి కార‌ణంగా అనుకోని మ‌లుపులు తీసుకుంటుంది. దీంతో వారు ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు ఏంటి?  వాటిని వారు ఎలా అధిగ‌మించార‌నేదే సినిమా కథాంశం. ట్రైలర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కేర‌ళ, త్రివేండ్రంలో జ‌రిగిన నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించారు.


మ‌ల‌యాళంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లు యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. హ్రిదు హ‌రూన్‌, సూర‌జ్ వెంజారుముడు వెర్స‌టైల్ యాక్టింగ్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోనున్నాయి. ఇంకా ఈ చిత్రంలో మాలా పార్వ‌తి, క‌ని కుస్రుతి, క‌న్న‌న్ నాయ‌ర్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ఫాజిల్ న‌జీర్ సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి క్రిస్టి జోబి మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

న‌టీన‌టులు:

హ్రిదు హ‌రూన్‌, సూర‌జ్ వెంజారుముడు, మాలా పార్వ‌తి, క‌ని కుస్రుతి, క‌న్న‌న్ నాయ‌ర్‌, జోబిన్ దాస్‌, అనుజిత్ క‌న్న‌న్‌, యెదు కృష్ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, ప్రొడ్యూస‌ర్‌:  రియా శిబు, ద‌ర్శ‌క‌త్వం:  మ‌హ్మ‌ద్ ముస్త‌ఫా, ర‌చ‌న‌:  సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  రోనీ జ‌కారియా, సినిమాటోగ్ర‌ఫీ:  ఫాజిల్ న‌జీర్‌, ఎడిట‌ర్‌: చ‌మన్ చ‌క్కో, మ్యూజిక్‌, బీజీఎం:  క్రిస్టి జోబి, యాక్ష‌న్‌:  పి.సి.స్టంట్స్‌, మేక‌ప్‌:  రోనెక్స్ గ్జెవియ‌ర్‌, కాస్ట్యూమ్స్‌:  నిసార్ రహ్మత్‌, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

Rocking Star Yash appeals A heartfelt letter ahead of his birthday

Rocking Star Yash, who rose to global stardom with the KGF franchise, has always enjoyed…

3 hours ago

అభిమానుల‌కు రాకింగ్ స్టార్ య‌ష్ హృద‌య‌పూర్వ‌క‌మైన లేఖ‌

రాకింగ్ స్టార్ య‌ష్‌.. కె.జి.య‌ఫ్ ఫ్రాంచైజీ చిత్రాల‌తో గ్లోబ‌ల్ రేంజ్ స్టార్ డ‌మ్‌ను సొంతం చేసుకున్న క‌థానాయ‌కుడు. అభిమానుల‌కు త‌న…

3 hours ago

RRR ప్రొడక్షన్స్ నిర్మాణం లో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట

RRR ప్రొడక్షన్స్ నిర్మాణం లో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్…

7 hours ago

కన్నప్ప నుంచి హిరోయిన్ ప్రీతి ముఖుంధన్ పోస్టర్ రిలీజ్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి…

7 hours ago

Mukhundhan As Nemali From Pan India Film Kannappa

Building on the positive Monday sentiment, the makers of the highly anticipated Pan-India film Kannappa,…

7 hours ago

Game Changer’s Massive Trailer on Jan 1St

Global Star Ram Charan teamed up with visionary filmmaker Shankar for the much-anticipated pan-India project…

9 hours ago