తపనతో “క” చిత్రాన్ని నిర్మించాను – నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో “క” సినిమా ప్రొడ్యూస్ చేసిన ఎక్సిపీరియన్స్ తెలిపారు నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి.

  • మా “క” సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మాది రాజమండ్రి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది. లాక్ డౌన్ టైమ్ లో “ఇప్పుడు కాక ఇంకెప్పుడు” అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఆ మూవీ చేశాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పైగా ముందు చిన్న సినిమా నిర్మిస్తే ఈ రంగంలో అనుభవం తెచ్చుకోవచ్చు. మంచి సినిమా చేశామనే గుర్తింపు వస్తే చాలు. నా సినిమా కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా. ఆ సినిమా తర్వాత సమంత నటించిన యశోద సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాను. ఆ సినిమాతో ఇండస్ట్రీలో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నా. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో వచ్చాను కాబట్టి నిర్మాతగా నాకు నష్టం జరగదు అని భావిస్తాను. నా వ్యాపారాలు నేను చేసుకుంటూనే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను.
  • హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. “క” సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్ తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు. ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది. నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికే వాళ్లు ఈ సినిమాలో రాము అనే కుక్కపిల్లకు ట్రెయినింగ్ ఇస్తున్నారు. అంతగా డైరెక్టర్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు క సినిమా రిలీజ్ కు ముందే మా కాస్ట్ అండ్ క్రూ మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్లకు అవకాశాలు వస్తున్నాయంటే నాకు సంతోషమే. వాళ్లను ఫస్ట్ మెట్టు ఎక్కించేది నేనే కావాలని కోరిక.
  • హీరో కిరణ్ అబ్బవరం కష్టపడే తత్వం ఉన్న హీరో. చాలా మంచివాడు. “క” సినిమాకు ఎంతో శ్రమించి వర్క్ చేశాడు. మే నెలలో మధ్యాహ్నం షూటింగ్ మొదలుపెడితే మళ్లీ ఉదయం దాకా డబల్ కాల్ షీట్ వర్క్ చేసేవాడు. రాత్రి 12 వరకు షూటింగ్ చేసినా మల్లీ ఉదయమే 5 గంటలకు సెట్ కు వచ్చేవాడు. షూటింగ్ చేస్తున్న స్టూడియో వాళ్లు కూడా మీ టీమ్ తక్కువ టైమ్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు అని అనేవారు. మా డైరెక్టర్స్ కూడా తాము అనుకున్నది వచ్చేదాకా రాజీపడేవారు కాదు ప్రతి షాట్ రిచ్ గా ఉండాలని ప్రయత్నించారు. మొన్న వారం రోజుల క్రితం వరకు కూడా చిన్న చిన్న షాట్స్ షూట్ చేసి యాడ్ చేశారు. అలా చివరి నిమిషం వరకు ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా కిరణ్ తో గతంలో వర్క్ చేసినవాళ్లే. కాబట్టి వాళ్లంతా ఒక టీమ్ వర్క్ లాగా కలిసి పనిచేశారు. దాంతో నిర్మాతగా నాకు టెన్షన్ తగ్గిపోయింది.
  • “క” సినిమా కథ మా డైరెక్టర్స్ ఎంత బాగా చెప్పారో అంతకంటే బాగా తెరకెక్కించారు. నేను ఔట్ పుట్ చూసి ఇంప్రెస్ అయ్యాను. కథను వాళ్లు మలుపుతిప్పిన విధానం చూసి వీళ్లు ఏదైనా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. క సినిమాకు సీక్వెల్ కూడా చేసుకోవచ్చు. మా సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ట్రెండ్ అయ్యాయి. ఇవాళ మా మూవీ గురించి ఇంతమంది మాట్లాడుకుంటారంటే ప్రొడ్యూసర్ గా సంతోషమే. టీజర్ రిలీజ్ అయిన వెంటనే బిజినెస్ కోసం కాల్స్ వచ్చాయి. వంశీ నందిపాటి గారిని కిరణ్ సజెస్ట్ చేశాడు. ఆయన ఏపీ, తెలంగాణ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో చాలా మంచి థియేటర్స్ లభించాయి. 350కి పైగా థియేటర్స్ లో క రిలీజ్ అవుతోంది.
  • పాన్ ఇండియా రిలీజ్ కావడం లేదనే బాధ లేదు. కాంతార సినిమా కన్నడలో హిట్ అయ్యాక తెలుగులోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలా క సినిమా తెలుగులో మంచి టాక్ తెచ్చుకుంటే మిగతా భాషల్లో క్రేజ్ ఏర్పడుతుంది. మా టీమ్ అంతా క సినిమా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకున్నాం. క సినిమాకు మొదట ఇచ్చోటనే అనే టైటిల్ అనుకున్నాం. అలాగే సినిమా మొదలుపెట్టాం. క టైటిల్ చెప్పినప్పుడు బాగుందని అనిపించింది. క పేరు మీద హిట్ సినిమాలు వచ్చాయి. సినిమాలో టైటిల్ ఎందుకు క అని పెట్టారో జస్టిఫికేషన్ ఇచ్చారు మా డైరెక్టర్స్. ఒక మంచి సినిమా చేయాలని హీరోతో పాటు యూనిట్ అంతా తపించింది.
  • ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి నాలాగే సినిమా అంటే ప్యాషన్. ఇప్పుడు ఆయనతో యశోద తర్వాత సారంగపాణి జాతకం అనే మూవీ కూడా కో ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను. ఆయన గోపి గారు మనం ట్రావెల్ చేద్దాం అన్నారు. ఆయన ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. నేను కూడా సరేనన్నాను. ప్రస్తుతం నాలుగు కథలు విన్నాను. మా సంస్థ నుంచి కొత్త ప్రాజెక్ట్ జనవరిలో ఫైనల్ చేస్తాను. ఏ ఫీల్డ్ లో లేని కష్టం చిత్ర పరిశ్రమలో ఉంది. అలాగే ఏ రంగంలో లేని గుర్తింపు, ఫేమ్ సినీ రంగంలో ఉంది. చింతా గోపాలకృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే అది మంచి సినిమానే అయి ఉంటుందనే పేరు తెచ్చుకోవాలనేదే నిర్మాతగా నా లక్ష్యం.
Tfja Team

Recent Posts

ఫీల్ గుడ్ ఎమోషన్‌తో రాబోతోన్న విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…

8 hours ago

కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని హామీ

సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…

10 hours ago

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…

11 hours ago

రాకింగ్ మంచు మనోజ్, అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్ లో ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ లాంచ్

రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…

2 days ago

భారీ సర్ప్రైజ్ తో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ – హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను…

3 days ago

‘ఐక్య’ నా బిడ్డ లాంటిది.. మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది – పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు

టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక…

3 days ago