టాలీవుడ్

మిస్టర్ సెలెబ్రిటీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది

కంటెంట్ ప్రధాన చిత్రాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించిన ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మా మనవడు హీరోగా వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ చిత్రాన్ని ఆడియెన్స్ అద్భుతంగా ఆదరిస్తున్నారు. మేం ఎన్నో చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాం. కానీ ఇప్పుడు వస్తున్న వారు కథ, కథనం, దర్శకత్వం, మాటలు ఇలా అన్నీ రాసుకుంటున్నారు. మిస్టర్ సెలెబ్రిటీ చిత్రానికి చందిన రవి కిషోర్ అన్నీ తానై ముందుండి తీసుకెళ్లాడు. ఓ దర్శకుడికి అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టుండాలి. అప్పుడే సినిమాను హ్యాండిల్ చేయగలడు. సెలెబ్రిటీల మీద పుకార్లు రావడం, వాటి వల్ల ఏర్పడే పర్యవసానాల మీద మంచి కథను అల్లుకున్నాడు. ట్విస్ట్ కూడా అందరినీ ఆకట్టుకుంది. కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అద్భుతంగా నిర్మించాడు. ఇంకా చూడని వాళ్లంతా కూడా సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.

బి. గోపాల్ మాట్లాడుతూ.. ‘నాకు పరుచూరి బ్రదర్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంద్ర కోసం పగలూరాత్రి తేడా లేకుండా కలిసి పని చేశాం. మా చిన్నబ్బాయ్.. పెద్దబ్బాయ్‌లంటే అందరికీ ఇష్టమే. వాళ్లు నాకు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు వారి మనవడు సుదర్శన్ హీరోగా వచ్చాడు. మిస్టర్ సెలెబ్రిటీ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. నేను కూడా సుదర్శన్‌తో ఓ సినిమా చేస్తాను. రఘు బాబు కామెడీకి అందరూ నవ్వుతున్నారు. వరలక్ష్మీ,నాజర్, ఆమని అందరూ బాగా నటించారు. ఈ సినిమాను ఇంత బాగా తీసిన దర్శక నిర్మాతలకు కంగ్రాట్స్’ అని అన్నారు.

రఘు బాబు మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీని జనాలు ఆదరించారు. పెద్ద హిట్‌ను అందించారు. పెద్ద ఆర్టిసులున్నారని ఈ చిత్రాన్ని ఆడియెన్స్ హిట్ చేయలేదు. మంచి కథ, ఆర్టిస్టులు అద్భుతంగా నటించడంతో ఆడియెన్స్ విజయాన్ని అందించారు. సుదర్శన్ బాబు పరుచూరి లెగసీని ముందుకు తీసుకెళ్తాడు. డెబ్యూతోనే మంచి విజయాన్ని సుదర్శన్ అందుకున్నాడు. కొత్త అమ్మాయి అయినా హీరోయిన్ కూడా చక్కగా నటించింది. నాజర్, ఆమని, వరలక్ష్మీ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. కెమెరా వర్క్ బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. రవి కిషోర్ దర్శకుడిగా పెద్ద స్థాయికి వెళ్తాడని అనిపిస్తోంది. మా నిర్మాత పాండు రంగారావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇంత మంచి చిత్రాన్ని థియేటర్లో చూడాలి’అని అన్నారు.

నిర్మాత పాండు రంగారావు మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. మా ఈ సక్సెస్ ఈవెంట్‌కు వచ్చిన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, బి గోపాల్ గారికి, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు చందిన రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీకి అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. కథ విన్న వెంటనే బాగుందని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు. స్క్రిప్ట్ మీద ఆయన చేయి పడింది కాబట్టే ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయింది. నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే పరుచూరి ఫ్యామిలీయే కారణం. మా హీరో సుదర్శన్ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ చిత్రానికి ఇంత గొప్ప ప్రమోషన్స్ దక్కాయి. ఈ సినిమాకు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన బలం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 day ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago