కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మైథలాజికల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతోన్న ‘వృషభ’ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ ముంబైలో ముగిసింది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో సెట్‌లో చిత్రయూనిట్ అంతా కూడా సందడి చేశారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేయనున్నారు.
విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్ ఇలా అన్ని పనుల్ని ప్రారంభించబోతోన్నారు. ఈ మూవీని మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.
లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా ఈ సినిమా ఉంటుందని మేకర్లు తెలిపారు. ప్రతీ ఒక్క సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని అంటున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో మరుపురాని చిత్రంగా వృషభ నిలుస్తుందని మేకర్లు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. మున్ముందు మరింతగా ప్రమోషనల్ కంటెంట్‌ను వదిలి సినిమాపై ఆసక్తిని పెంచబోతోన్నారు. వృషభ జర్నీ ఇప్పుడే మొదలైందని, ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. అంతకు మించేలా ఉంటుందని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…