‘లూసిఫర్’ 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్‌లు నటిస్తున్నారు.
తొలి భాగం హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్ లాల్, వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం కావటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి.
ఇటీవల మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్రమ్‌గా సూపర్‌స్టార్ లుక్‌ను … అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తోన్న క్యారెక్టర్ జయేద్ మసూద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ చిత్రంలో టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు మరోసారి వారి పాత్రలతో మెప్పించబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 27న ‘L2 ఎంపురాన్’ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
‘L2 ఎంపురాన్’ రిలీజ్ డేట్‌ను తెలియజేస్తూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మంటల మధ్యలో వైట్ షర్ట్ ధరించిన మోహన్ లాల్ లుక్‌ను బ్యాక్ సైడ్‌నుంచి ఎలివేట్ చేసేలా ఉన్న సదరు పోస్టర్ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌లా సినిమా రూపొందుతోందని అంచనాలను పెంచేస్తోంది.
నటీనటులు:
మోహన్ లాల్, టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు
సమర్పణ: లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్, ఆశీర్వాద్ సినిమాస్ ఆంటోని పెరుంబవూర్, దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్, నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, బ్యానర్స్: లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రచన: మురళీ గోపి, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్, మ్యూజిక్: దీపిక్ దేవ్, ప్రొజెక్ట్ డిజైన్: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, ప్రొడక్షన్ కంట్రోలర్: సిదు పనకల్, ఆర్ట్: మోహన్ దాస్, ఎడిటర్ : అఖిలేష్ మోహన్, సౌండ్ డిజైన్: ఎం.ఆర్.రాజశేఖరన్, యాక్షన్: స్టంట్ సిల్వ, కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకర్, మేకప్: శ్రీజిత్ గురువాయుర్, స్టిల్స్ : సినత్ సేవియర్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) .
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…