ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Must Read

లెజెండరీ నటుడు మోహన్ బాబు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా ప్రమోషన్స్‌ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషనల్ టూర్‌లో భాగంగా కన్నప్ప టీమ్ దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తోంది.

ఈ క్రమంలో మోహన్ బాబు, విష్ణు మంచు గుజరాత్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ భూపేంద్ర పటేల్ గారిని కలిశారు. ఈ టూర్‌లో శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి కూడా సందడి చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ అతిథి మర్యాదలకు, పలికిన సాదర స్వాగతాలకు కన్నప్ప టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల అందమైన పెయింటింగ్‌ను విష్ణు మంచు ముఖ్యమంత్రికి బహుకరించారు. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.

Latest News

Beauty Lovely Teaser Unveiled On Valentine’s Day

Vanara Celluloid is making waves in the film industry with its bold move into film production, kicking off with...

More News