మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న గ్రాండ్ రిలీజ్‌

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టిల‌ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’… వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న గ్రాండ్ రిలీజ్‌.తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌

వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టుడిగా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ప్ర‌ముఖ నిర్మాణ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ‘భాగమతి’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ . సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. అందుకు త‌గిన‌ట్లు ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, రెండు సాంగ్స్ రిలీజ్ కాగా.. వాటికి ఆడియెన్స్ నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో ఓ పాట‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ పాడ‌టం విశేషం. ఈ క్ర‌మంలో తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌.. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి పాత్ర‌లు మ‌న‌సుల‌ను హ‌త్తుకునేలా రూపొందించారు. టీజ‌ర్ చూడ‌గానే ఆ విష‌యం క్లియ‌ర్‌గా తెలిసిపోతుంది. తాజాగా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులోనూ హీరో హీరోయిన్లు ఉన్నారు. ఓ ప్లెజంట్ ఫీలింగ్ ఇచ్చేలా పోస్ట‌ర్ ఉంది. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మెప్పంచ‌టానికి ఆగ‌స్ట్ 4న మ‌న ముందుకు వ‌చ్చేస్తుంది.

సంగీతం: ర‌ధన్‌
బ్యాన‌ర్‌: యువీ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు: వంశీ – ప్ర‌మోద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బాబు.పి
సినిమాటోగ్ర‌ఫీ: నిర‌వ్ షా
కొరియోగ్ర‌ఫీ: రాజు సుంద‌రం
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: రాఘ‌వ్ త‌మ్మారెడ్డి

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago