‘భాగ్ సాలే’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్లు హరీష్‌ శంకర్, దశరద్, వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘మత్తువదలరా సినిమా చూశాక సింహాకు ఫ్యాన్ అయ్యాను. కలర్ ఫోటో సినిమా చూసి కాళ భైరవకు ఫ్యాన్ అయ్యాను. ఈ ఇద్దరూ ఎంతో ఒదిగి, ఎంతో సింపుల్‌గా ఉంటారు. ప్రణీత్ తీసిన సూర్యకాంతం సినిమా నాకు నచ్చింది. భాగ్ సాలే కథ నాకు చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అంతా సరదాగా సాగుతూ ఉంటుంది. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్తుంటారు. కానీ కాలేజ్ ఎగ్గొట్టి ఈ సినిమాను తీసినట్టుగా అనిపిస్తుంది. ప్రణీత్‌కు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ప్రతీసారి ప్రొగ్రెస్‌మెంట్ గురించి ఆలోచిస్తుంటాడు. నేను ఈ సినిమాను నిర్మించాల్సింది కానీ మిస్ అయింది. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. కొత్త కామెడీ టైమింగ్‌ను చూస్తారు. కాళ భైరవ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. తండ్రి పేరును నిలబెడతాడు. జూలై 7న మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూడబోతోన్నారు. నేను, విష్ణు కలిసి ప్రణీత్‌తో ఓ సినిమాను చేయబోతోన్నాం. సింహాలో మంచి టైమింగ్‌ ఉంటుంది. అంతే కాకుండా మంచి సంస్కారం, వ్యక్తిత్వం ఉంది’ అని అన్నారు.

అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ.. ‘భాగ్ సాలే అనేది క్రైమ్ కామెడీ జానర్. నాకు ఆ జానర్ సినిమాలు చాలా ఇష్టం. ట్రైలర్‌ చూశాక సినిమా హిట్ అవుతుందని మరింత నమ్మకంగా కలిగింది. జూలై 7న ఈ సినిమా రాబోతోంది. మ్యూజిక్ బాగా వచ్చింది. కాళ భైరవ రీరికార్డింగ్ అద్బుతంగా వచ్చింది. కాస్త ఆలస్యం అయింది కానీ అద్భుతంగా చేశాడు. ప్రణీత్‌కు మంచి ఫ్యూచర్‌. ఆయనతో త్వరలోనే మరో సినిమా చేస్తాను. దళపతి విజయ్‌లో ఉండే ఇన్నోసెన్స్‌ సింహాలో ఉందని ఓ ఓటీటీ హెడ్ అన్నారు. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఈ అన్నదమ్ములిద్దరికీ కొంచెం కూడా గర్వం లేదు. మా ఈవెంట్‌కు వచ్చిన గెస్టులకు థాంక్స్. జూలై 7న థియేటర్లో అందరినీ నవ్వించబోతోన్నామ’ని అన్నారు.

శ్రీ సింహా మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన హరీష్‌ శంకర్ గారు, దశరద్ గారు, వశిష్ట, విష్ణు గారికి థాంక్స్. మా సినిమా గురించి వీడియో బైట్ ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్స్. వాయిస్ ఓవర్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డకు థాంక్స్. రాజీవ్ మామ, జాన్‌ వంటి సీనియర్లతో నటించడం ఆనందంగా ఉంది. కెమెరామెన్ రమేష్, ఆర్ట్ డైరెక్టర్ శ్రుతి, ఎడిటర్‌ కార్తిక్‌లకు థాంక్స్. కాళ భైరవ మాకు మ్యూజిక్ చేయడం ఆనందంగా ఉంది. ప్రణీత్ అన్న ఎప్పుడూ కూడా ఇంప్రూవ్‌మెంట్ కోసం చూస్తుంటాడు. షూటింగ్‌కు వెళ్లే ముందు వరకూ పదిహేను వర్షెన్స్‌ రాసుకున్నారు. మా సినిమాను ఇంతలా సపోర్ట్ చేసిన మా నిర్మాతలు అర్జున్, యశ్ గారికి థాంక్స్. జూలై 7న థియేటర్లోకి ఈ సినిమా రాబోతోంది. అందర్నీ కచ్చితంగా నవ్విస్తామ’ని అన్నారు.

ప్రణీత్ బ్రాహ్మాండపల్లి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డకు థాంక్స్‌. ట్రైలర్ చూసి చిరంజీవి గారు కాంప్లిమెంట్ ఇవ్వడం మరిచిపోలేని ఘటన. ఇక్కడకు గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌, దశరధ్, వశిష్టలకు వచ్చిన థాంక్స్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు మా అమ్మానాన్నలు ఎంతగానో సపోర్ట్ చేశారు. నా సిస్టర్ విన్నికి థాంక్స్. స్క్రీన్ మీద కనిపించే హీరో శ్రీసింహా. కనిపించని హీరో కాళభైరవ. మా నిర్మాత అర్జున్ సర్‌తో ఒక్కసారి పని చేస్తే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. ఆయన మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. భాగ్ సాలే అనేది యూనిక్ టైటిల్. ఈ సినిమాలో అన్నీ కూడా యూనిక్ కారెక్టర్లుంటాయి. ఇందులో ఖతర్నాక్ కారెక్టర్ ఉంటుంది. శ్రీసింహా అద్భుతంగా నటించారు. ఆయన నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు సినిమాలన్నీ కూడా ధమ్ బిర్యానీలా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. మాది ఇరానీ చాయ్ లాంటి సినిమా. ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మిమ్మల్ని వంద శాతం నవ్విస్తుంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

దశరధ్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశాను. నాకు చాలా బాగా వచ్చింది. కాళ భైరవ ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ప్రణీత్‌కు మంచి డైలాగ్స్ రాసే కెపాసిటీ ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌’ అని అన్నారు.

వశిష్ట మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా బాగుంది. ప్రణీత్‌కు కంగ్రాట్స్. సింహా టైమింగ్ బాగుంది. కాళ భైరవ సంగీతం బాగుంటుంది. మేం అంతా కూడా ఒకే కాలేజ్. జూలై 7న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాల’ని కోరుకుంటున్నాను.

యశ్ రంగినేని మాట్లాడుతూ.. ‘భాగ్ సాలే సినిమా రెండేళ్ల క్రితం మొదలైంది. అర్జున్ గారి ఈ ప్రాజెక్ట్‌ను ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాను ఇప్పటికే రెండు సార్లు చూశాను. ఎంతో ఎంటర్టైనింగ్‌గా వచ్చింది. ఇన్ని పాత్రలను హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. కాళ భైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సింహా ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. జూలై 7న థియేటర్లో ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

విష్ణు ఇందూరి మాట్లాడుతూ.. ‘ప్రణీత్ నాకు ముందు నుంచీ పరిచయం. ఈ సినిమా ట్రైలర్ చూశాను. సినిమా అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. కుర్రాళ్లంతా కలిసి తీసిన సినిమాను మనమంతా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు అంతా కూడా పీరియడ్ డ్రామా, యాక్షన్ డ్రామాలు వస్తుంటే.. ఓ క్రైమ్ కామెడీ జానర్లో సినిమాను తీసిన నిర్మాతలకు హ్యాట్సాఫ్. జూలై 7న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

కాళ భైరవ మాట్లాడుతూ.. ‘జూలై 7 కోసం నేను చాలా ఎదురుచూస్తున్నాను. రెండు గంటల సినిమా అస్సలు టైం తెలియకుండా అయిపోతుంది. ఒక్కసారి చూసిన వాళ్లు మళ్లీ కచ్చితంగా వచ్చి చూస్తారు’ అని అన్నారు.

కెమెరామెన్ రమేష్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు సింహా, కాళ భైరవలు బ్రదర్స్ వంటి వారు. ఈ సినిమాతో ప్రణీత్‌ మరో బ్రదర్ అయ్యాడు. భాగ్ సాలే టైటిల్ నాకు ఈ సినిమా షూటింగ్‌లో సెట్ అయింది. ఇప్పుడు కూడా వేరే ఊర్లో షూటింగ్‌లో ఉంటే వచ్చాను’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

21 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago