‘మాయాబజార్ ఫర్ సేల్’ .. ఓ రోలర్ కోస్టర్‌లా కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డా. నరేష్ వి.కె
వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసి దూసుకెళ్తోన్న డిజిటల్ మాధ్యమం జీ 5 త్వరలోనే ‘మాయాబజార్ ఫర్ సేల్’ అనే సరికొత్త మల్టీస్టారర్ తెలుగు వెబ్ ఒరిజినల్‌ను అందించనుంది. వివిధ కథ, కథనాల ద్వారా సెటైరికల్ డ్రామాగా రూపొందుతోన్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతోంది. జీ 5తో పాటు రానా దగ్గుబాటికి సంబంధించిన స్పిరిట్ మీడియా బ్యానర్ కలిసి సునిశితమైన, హృద్యమైన డ్రామాగా మాయాబజార్ ఫర్ సేల్‌ను రూపొందిస్తున్నారు. ఇదొక గేటెడ్ కమ్యూనిటీలోని కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆదివారం ‘మాయాబజార్ ఫర్ సేల్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో జీ 5 వైస్ ప్రెసిడెంట్..సౌత్ కంటెంట్ హెడ్ సాయితేజ్ దేశ్‌రాజ్, స్పిరిట్ మీడియా రాజీవ్ రంజన్, డైరెక్టర్ గౌతమి, డా. నరేష్ వి.కె, ఝాన్సీ, రాజా చెంబోలు, సునైన, అదితి, రవిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
రవిరాజ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ గౌతమిగారికి థాంక్స్. నరేష్‌గారు, ఝాన్సీగారు వంటి యాక్టర్స్‌తో కలిసి నటించటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. జీ5లో ఇది నాకు రెండవ వెబ్ సిరీస్. ఇంతకు ముందు ఏటీఎం అనే వెబ్ సిరీస్‌లో నటించాను. జూలై 14న ‘మాయాబజార్ ఫర్ సేల్’ స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ కావొద్దు’’ అన్నారు.
అదితి మాట్లాడుతూ ‘‘అవకాశం ఇచ్చిన గౌతమికి థాంక్స్. ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చూడండి’’ అన్నారు.
సునైన మాట్లాడుతూ ‘‘జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతున్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ అందరికీ కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ గౌతమికి సదా రుణపడి ఉంటాను. నా అరుపులు ట్రైలర్‌లో చూశారు. నా ఆవేదనను రేపు స్క్రీన్‌పై చూశారు. అందరూ కలిసి చూసేలా ‘మాయాబజార్ ఫర్ సేల్’ ఉంటుంది’’ అన్నారు.
రాజా చెంబోలు మాట్లాడుతూ ‘‘జీ 5, స్పిరిట్ మీడియాకు థాంక్స్. ‘మాయాబజార్ ఫర్ సేల్’ సిరీస్ ఎంతో స్పెషల్. ఎందుకంటే చూసిన ఆడియెన్స్ ఎక్కడో ఓ చోట కనెక్ట్ అవుతారు. నరేష్‌గారు, ఝాన్సీగారు, సునైన, డైరెక్టర్ గౌతమిగారు ఇలా మంచి టీమ్‌తో కలిసి పని చేసే అవకాశం దక్కింది. జూలై 14న సిరీస్‌ను జీ5లో చూడండి’’ అన్నారు.
ఝాన్సీ మాట్లాడుతూ ‘‘జీ 5లో ఆడియెన్స్ మంచి వెబ్ సిరీస్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ‘మాయాబజార్ ఫర్ సేల్’ ను ఎంజాయ్ చేస్తారు. తెలుగు సినిమాల్లో ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమా ఎలాంటి కామెడీని క్రియేట్ చేసి గుర్తుండిపోయిందో అలాగే ‘మాయాబజార్ ఫర్ సేల్’ నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. ఈ దశాబ్దానికే కాదు.. రాబోయే రెండు దశాబ్దాలకు కూడా ఇలాంటి కామెడీ ఉన్న వెబ్ సిరీస్ మరోటి రాదు. రానాగారి స్పిరిట్ మీడియా, జీ 5 కాంబోలో వస్తున్న ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అందరూ నిరుత్సాహంగా ఉన్నప్పుడు ‘మాయాబజార్ ఫర్ సేల్’ ను చూస్తే తెలియని ఉత్సాహం వస్తుంది. జూలై 14న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నార.
డైరెక్టర్ గౌతమి చిల్లగుల్ల మాట్లాడుతూ ‘‘మెయిన్ సిటీలో నుంచి విల్లాస్‌లోకి మారినప్పుడు నాకైతే ఏమీ అర్థం కాలేదు. నాలాగే చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇక ‘మాయాబజార్ ఫర్ సేల్’ విషయానికి వస్తే.. దీనికి కావాల్సిన కంటెంట్ అంతా మా వాట్సప్ గ్రూపు నుంచే వచ్చేసింది. ప్రతి ఫ్యామిలీలో ఎమోషన్స్ కామన్‌గా ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ అనేది ఓ జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడో కనెక్ట్ అవుతారు. స్టేజ్‌పై ఉన్న ఆర్టిస్టులే కాకుండా చాలా మంది ఆర్టిస్టులుంటారు. జంధ్యాలగారి స్ఫూర్తిగా తీసుకుని క్యారెక్టర్ రాశాను. జూలై 14 నుంచి ‘మాయాబజార్ ఫర్ సేల్’ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
జీ 5 వైస్ ప్రెసిడెంట్..సౌత్ కంటెంట్ హెడ్ సాయితేజ్ దేశ్‌రాజ్ మాట్లాడుతూ ‘‘ఓటీటీని మరీ బూతు చేసేశారు. ఓటీటీలో ఏదైనా కంటెంట్ వస్తుందంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాలా అనిపిస్తుంది. కానీ జీ5లో రాబోతున్న ‘మాయాబజార్ ఫర్ సేల్’ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. 6 ఏళ్ల వయసు నుంచి 60 వయసు వరకు ఉన్న అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. గౌతమిగారు చక్కగా డైరెక్ట్ చేశారు. స్పిరిట్ మీడియా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్‌ను రూపొందించారు. మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో చేశారు. దీనికి సీక్వెల్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి పాత్ర మనకు ఎదో ఒకటి గుర్తు చేస్తుంది. ఇందులోని పాత్రలు నవ్వించటమే కాదు.. ఎమోషనల్‌గా కంటతడి కూడా పెట్టిస్తాయి. మనల్ని పాత్రలు వెంటాడుతుంటాయి. నరేష్‌గారు, ఝాన్సీగారు, రాజాగారు, సునైన ఇలా అందరూ అద్భుతంగా నటించారు. వ్యవస్థ, పులి మేక, రెక్కీ. ఇలా ప్రతి నెల ఓ కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. పండగలాంటి సిరీస్ ‘మాయాబజార్ ఫర్ సేల్’ను జూలై 14న జీ 5లో చూసి ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
డా. నరేష్ వి.కె మాట్లాడుతూ ‘‘జీ 5 నుంచి సాయి తేజ్, స్పిరిట్ మీడియా అండ్ టీమ్, విరాజ్ అండ్ టీమ్, మాయాబజార్ అండ్ టీమ్‌కి థాంక్స్. 1990, 2000 దశకాల్లో గేటెడ్ కమ్యూనిటీ అనేది ఓ డ్రీమ్. ఇప్పుడు వేల కొద్ది గేటెడ్ కమ్యూనిటీలున్నాయి. దీన్ని ఇప్పుడు ఇరుగు పొరుగు అని అనుకోవాలి. ‘మాయాబజార్ ఫర్ సేల్’ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక రోలర్ కోస్టర్, ఫ్యామిలీ ఫన్ రైడర్. షూటింగ్ అంతా కార్నివాల్‌గా చేశాం. డైరెక్టర్ గౌతమిని అభినందిస్తున్నాను. ఓ కొత్త డైరెక్టర్ ఇలాంటి కంటెంట్‌ను చేయాలంటే సాధారణ విషయం కాదు. అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. అందరూ కుటుంబంతో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. జీ 5లో జూలై 14న స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…