వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ టాలెంటెడ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ కిరణ్ అబ్బవరంతో నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా ఇది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం పవర్‌ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఆయన లుక్, పాత్ర అన్ని కొత్తగా వుంటాయి. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్ 7న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ: వెంకట్.సి.దిలీప్ అండ్ సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్ కాదూరి, సూర్య, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందులు, మార్కెటింగ్: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి:మ్యాక్స్ మీడియా, పీఆర్‌ఓ : వంశీ శేఖర్, మడూరి మధు, సమర్పణ: నవీన్ ఎర్నేనీ, రవి శంకర్ యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్ కాదూరి,
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…
శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…
ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…