35 మంది కొత్తవారితో ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ బేనర్లో నిర్మించిన ‘మేమ్ ఫేమస్` టీజర్, సాంగ్స్ ప్రదర్శన, మే 26న చిత్రం విడుదల
సరికొత్త కథలతో, విభిన్నమైన సినిమాలు నిర్మించే ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్ ఫేమస్‘. విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందింది. ఈసినిమా ప్రమోషన్ కు విజయ్‌దేవరకొండ, అనిల్ రావిపూడి,హరీష్ శంకర్, నాగచైతన్య వంటి ప్రముఖులు సపోర్ట్ గా నిలిచి సినిమా కు మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇందులో నటించిన 35మంది కొత్తవారితో పాటు, సినిమా కంటెంట్ విడుదలకు ముందే ఫేమస్ అయిపోయింది. ఈ సందర్భంగా శనివారంనాడు మేమ్ ఫేమస్ చిత్ర యూనిట్ థావత్ అనే ప్రోగ్రామ్ తో ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించి టీజర్, రెండు పాటలను విలేఖరులకు ప్రదర్శించారు.
చక్కటి సాహిత్యం తో కూడిన ‘అయ్యయో.. ఏమయింది గుండెల్లోన..’ పాట రాహుల్ సిప్లిగంజ్ గాత్రంతో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్, సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్, కెమెరామెన్ శ్యామ్, ఎడిటర్ సృజన, సౌండ్ డిజైనర్ నాగార్జున, ఎగ్జిక్యూటివ్ నిర్మాత సూర్య చౌదరి, నటీనటులు మణి, మౌర్య చౌదరి, కిరణ్ మచ్చ, అంజిమామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివనందన్, సిరిరాశి, సార్య, రచయిత, దర్శకత్వం సుమంత్ ప్రభాస్ హాజరయ్యారు.
అనంతరం నిర్మాతల్లో ఒకరైన శరత్ చంద్ర మాట్లాడుతూ, నిన్న రాత్రే ఫైనల్ అవుట్ పుట్ చూశాం. అందుకే అందరితో కలిసి థావత్ చేసుకోవాలని ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాం. ఛాయ్ బిస్కెట్, లహరి ఫిలింస్ తో కలిసి అంతా కొత్త వారిని లాంఛ్ చేయడం ఆనందంగా వుంది. కొత్తవారి లో ఎనర్జీ ఏమిటో ఈ సినిమాలో చూస్తే మీకే తెలుస్తుంది. 2012 లో నేను, అనురాగ్ జర్నీ మొదలు పెట్టాం. ఫస్ట్ షో అనే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాం. అలా 100 సినిమాలకు మార్కెటింగ్ చేశాం. ఈ క్రమంలో 2016 లో ఛాయ్ బిస్కట్ మొదలుపెట్టాం. యూట్యూబ్ ప్రారంభించాం. 1500 పైగా యూ ట్యూబ్ సినిమాలు చేశాం. వెబ్ సిరీస్ చేశాం. ఈ సినిమా జర్నీ చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. చాలామంది మాకు సపోర్ట్ గా నిలిచారు. ‘మనం చేసిన మంచి ఎక్కడికి పోదనేది’ సినిమాలో డైలాగ్ వుంది. అదే మాకు వర్తిస్తుందని అనుకుంటున్నాం. ఈ సినిమా చూశాక అందరూ మజా చేస్తారని హామీ ఇస్తున్నాను. గీతా ఆర్ట్స్ రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. సరిగమ ద్వారా ఓవర్‌సీస్ లో రిలీజ్ అవుతుంది. వైజాగ్ లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన ట్రైలర్ లాంఛ్ జరపనున్నాం అని అన్నారు.
నిర్మాతల్లో మరొకరు అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ, టీజర్, సాంగ్స్ కు ప్రమోషన్ చేసిన అందరికీ థ్యాంక్స్. మే 26న మా సినిమా విడుదలవుతుంది. నేను ఏమి లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. అందుకే ఏమీ లేని వారి తోనే (కొత్తవారితో) ముందుకు నడుస్తా. వారితో ఇంకా బెటర్ ఫిలింస్ చూస్తూనే వుంటాం. 18 ఏళ్ళకే టిక్ టాక్ లు చేసిన సుమంత్ 23 ఏళ్ళకే డైరెక్టర్ గా అయ్యాడు. ఇలా అంతా యూత్ చేసిన సినిమా. మీకు బాగా నచ్చుతుందని అన్నారు.
లహరి ఫిలింస్ చంద్రు మనోహర్ మాట్లాడుతూ, 30మందికిపైగా నటీనటులను పరిచయం చేయడం గర్వంగా వుంది. దర్శకుడు బాగా చేశాడని అన్నారు.
రచయిత, దర్శకుడు సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ, కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికే ఛాయ్ బిస్కెట్ సంస్థను పెట్టారు. అందుకు ధైర్యం చేసిన నిర్మాతలకు ధ్యాంక్స్ చెపుతున్నా. అందరికీ నచ్చేలా అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా వుంటుంది. ఫైనల్ కాపీ చూశాక చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. ఈ సినిమా ప్రమోషన్ కు ప్రముఖ హీరోలంతా సహకరించడంతో నాకు మరింత పేరు వచ్చింది. వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కుటుంబాన్ని గుర్తు చేసింది. మంచి క్వాలీటీ కంటెంట్ తో ఛాయ్ బిస్కెట్ సంస్థ సినిమాలు నిర్మిస్తోంది. ఒక ఊరిలో జరిగే కథ కాబట్టి అక్కడ వున్నట్లు కాస్ట్యూమ్ డిజైనర్ గా మాకు కాలేజీ లో సీనియర్ అయిన శివను ఎంపిక చేశాం. నా ఫ్రెండ్ దుర్గను కాస్టింగ్ డైరెక్టర్ గా పెట్టాను. అలా 30 మందిని కథకు అనుగుణంగా కొత్తవారిని ఎంపిక చేశాం. కళ్యాణ్ మంచి సంగీతం సమకూర్చారు. ‘పిల్లపిల్లోడు’ షార్ట్ ఫిలిం కూడా కళ్యాణ్ బాగా సంగీతం ఇచ్చారు. మేమ్ ఫేమస్ లో 9 ఎనర్జిటిక్ సాంగ్స్ వున్నాయి. కళ్యాణ్ బీజియమ్ బాగా చేశాడు. సినిమా అంతా మటన్ దావత్ ఇచ్చినట్లుంటుంది అన్నారు.
సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, రైటర్ పద్మభూషణ్ తర్వాత ఈ బేనర్ లో అవకాశం ఇచ్చారు. ఈరోజు రెండు పాటలు చూశారు. ఇంకా ఏడు పాటలున్నాయి. అన్నీ చాలా బాగుంటాయి. మూవీ అమేజింగ్ గా వుంటుంది. ఇందులో ప్రతి క్యారెక్టర్ మన కుటుంబంలో కుటుంబ సభ్యులను టచ్ చేస్తుంది. మంచి సంగీతం ఇచ్చాను అందరినీ అలరిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
కెమెరా మెన్ శ్యామ్ మాట్లాడుతూ, దర్శకుడు సుమంత్ షూటింగ్ లో ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా చూస్తే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
ఎడిటర్ సృజన మాట్లాడుతూ, నాకిది మొదటి సినిమా. చాలా ప్రత్యేకమైంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
నటుడు అంజి మామ మాట్లాడుతూ, నాకిది 2వ సినిమా. ఈ సినిమా సింక్ సౌండ్ తోనూ, డబ్బింగ్ తోనూ చేశాను. సుమంత్ ను చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తుకువచ్చాయి. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని అన్నారు.
నటుడు కిరణ్ మచ్చ మాట్లాడుతూ, దర్శక నిర్మాతలు మాకెంతో సపోర్ట్ చేశారు. సెలబ్రిటీస్ తో కలుస్తున్నామంటే అందుకు వారే కారణం. సినిమాపరంగా చెప్పాలంటే ఊరిలోకి వెళ్ళి వారి ఎమోషన్స్, విషయాలు చూసి బయటకు వచ్చినట్లు ఉంటుంది అన్నారు.
నటుడు మౌర్య మాట్లాడుతూ, నాకిది మొదటి సినిమా. నన్ను నమ్మి ఆడిషన్‌లో దర్శకుడు సెలెక్ట్ చేశారు. నిర్మాతలకు కృతజ్ఞతలు. అందరూ చాలా సపోర్ట్ చేశారు.
మణి యేగుర్ల మాట్లాడుతూ, ప్రమోషన్ క్యాంపెయిన్ కు విజయ్, తరుణ్‌భాస్కర్ వీరంతా ప్రమోషన్ కు హెల్ప్ చేస్తున్నారు. మే 26 నాడు థియేటర్ లో హల్ చల్ చేద్దామని అన్నారు.
నటి సిరి రాశి మాట్లాడుతూ, అంతా కొత్తవారితో నిర్మాతలు సినిమా చేయడం చాలా చాలా గ్రేట్ ,నమ్మకంతో అవకాశాలు ఇచ్చినందుకు ధ్యాంక్స్. దర్శకుడు సుమంత్ కు అన్ని విషయాల్లో క్లారిటీ వుంది. కళ్యాణ్ చక్కటి బీజియం ఇచ్చారు అని అన్నారు.
నటి సార్య మాట్లాడుతూ, సినిమా చూశాను. మరింత కాన్‌ఫిడెన్స్ పెరిగింది అన్నారు.
దావత్ కార్యక్రమం తీన్ మార్ డప్పులు, డాన్స్ తో మేమ్ ఫేమస్ టీమ్ సందడి తో ప్రారంభమైంది.