మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న భారీ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు.
రీసెంట్‌గా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయగా..అప్పటికే ఉన్న అంచనాలను ఇది రెట్టింపు చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘నీ జతై…’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. వరుణ్ తేజ్, సాక్షి వైద్యల మధ్య సాగే పాట ఇది.
మిక్కీ జె.మేయర్ సంగీత సారథ్యంలో వస్తోన్న ‘గాంఢీవధారి అర్జున’ చిత్రంలో నీ జతై.. మెలోడీ సాంగ్‌ను ఎల్వ్యా, నకుల్ అభయంకర్ పాడారు. పాట విన సొంపుగా ఉంది. కచ్చితంగా ఈ సీజన్‌లో ఇది ట్రెండింగ్ సాంగ్ అవుతుందని అందరూ అంటున్నారు.
సరికొత్త యాక్షన్ సీక్వెన్సులతో ఇన్‌టెన్స్ యూనిక్ స్టోరీ లైన్‌తో సినిమా అందరినీ మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇందులో వరుణ్ తేజ్‌తో పాటు సాక్షి వైద్య కూడా స్పెషల్ ఏజెంట్‌గా కనిపించనుంది. సీనియర్ నటుడు నాజర్ ఇందులో కీలక పాత్రలో నటించారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌లో వరుణ్ తేజ్ కనిపించబోతున్నారు.
వరుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియన్ దేశాలతో పాటు యు.ఎస్.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బడ్జెట్‌తో ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్‌ను అందిస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…