సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్..

సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్.. రీల్ టు 3D ప్రింట్ కోసం ఎంతో శ్రమించిన చిత్రయూనిట్

టాలీవుడ్ నుంచి వచ్చి అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మాట్లలో.

ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌కి ఒక గేమ్‌చేంజర్‌గా ఆయన ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామ్లీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటితరం ప్రేక్షకుల ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మూడు సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల, ఎంత వెతికినా కూడా అసలైన నెగటివ్ దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ, ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.

2018లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి, చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకుంది చిత్రబృందం. అయితే కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ కాగా, చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్
ఒకటి దొరికిందని చిత్రబృందం చెబుతోంది. అదికూడా దుమ్ము దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభిచారట. రీల్ ఎక్కడ ఎక్కడ కట్ అయిందో అక్కడ దానికి మరమ్మతు చేసి, జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను తొలగించారు. తర్వాత చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

అనేక ఏళ్ల శ్రమ, నిబద్ధతతో పునరుద్ధరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్తగా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ఫార్మాట్లలో మే 9 నుంచి మళ్లీ థియేటర్లలో మీరు ఈ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో.. మెగా ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ బీ రెడీ

Tfja Team

Recent Posts

భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ జోరు – అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం..!

మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు…

4 days ago

రెండు లక్షల మందితో పాట్నాలో అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ‘పుష్ప 2’ పాట్నా కార్యక్రమానికి రెండేళ్లు.. 2.6 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులతో సరికొత్త మైలురాయి..!

2 లక్షలకు పైగా ప్రజలు హాజరవడం, 2.6 లక్షల మంది యూట్యూబ్ వీక్షకులు ఏకకాలంలో వీక్షించడంతో, భారతీయ సినిమా చరిత్రలో…

4 days ago

ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు పొందడం నిజంగా గొప్ప విషయం..!

‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకుంది. అనీష్‌కు తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్ రావడం, దాన్ని అద్భుతంగా నిరూపించుకోవడం, ప్రేక్షకుల ఆశీస్సులు…

4 days ago

ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు జాతీయ స్థాయిలో నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మ‌య‌స‌భ‌’ చరిత్ర!

57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి తెలుగు రాజకీయ వెబ్…

4 days ago

చిత్ర పరిశ్రమకు అండగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి..!

AI దుర్వినియోగంపై పటిష్ఠ రక్షణ చర్యలు కోరుతూ వినతిపత్రం - సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేస్తామని కేంద్ర మంత్రి…

5 days ago

డైనమిక్ హీరో శ్రీరామ్ “రామభద్రుడు” సినిమా హైదరాబాద్ ఆడిషన్స్ సూపర్ సక్సెస్, ఈ నెల 28, 29 తేదీల్లో నెల్లూరులో జరగనున్న ఆడిషన్స్..!

"యంగ్ అండ్ డైనమిక్", "మా రాముడు అందరివాడు" వంటి పలు హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డైనమిక్ హీరో శ్రీరామ్…

5 days ago