కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ చేతులు మీదగా “తెరచాప” టీజర్ లాంచ్

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా హరికథ దర్శకుడు మ్యాగి మాట్లాడుతూ… ” పృథ్వి గారికి నమస్కారం. ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ నేను టీజర్ లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది.” అని అన్నారు.

నటుడు 30 ఇయర్స్ పృద్వి గారు మాట్లాడుతూ… “తెరచాప ఒక అద్భుతమైన సినిమా. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఆయన సినిమా కోసం ఎంత కష్టపడతాడో నవీన్ కూడా అంతే కష్టపడుతున్నాడు. కచ్చితంగా ఇతను మన టాలీవుడ్ కి విక్రమ్ లాంటి హీరో అవుతాడు
ఈ సినిమా కోసం నవీన్ చాలా కష్టపడ్డాడు. అతన్ని చాలా అభినందించాలి. రాత్రి పగలు కష్టపడ్డాడు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యలేదు.అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడి ఆసుపత్రిపాలు కూడా అయ్యాడంటే అర్ధం చేసుకోండి. నిజంగా అతన్ని కష్టాన్ని అభినందించాలి. తన ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ కాదు.అతని కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కాలని మనసారా కోరుకుంటున్నా” అని అన్నారు.

డైరెక్టర్ జోయెల్ జార్జ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాని మంచి మాస్ సినిమాగా తీసాం. అలాగే ఇందులో కొంచెం తమిళ నేపథ్యం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించి రిఫరెన్స్ లు కూడా సినిమాలో మీరు చూడవచ్చు. ఈ సినిమా కోసం మా నటులు, టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ళ సహకారం లేకుంటే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చుండేది కాదు. మంచి ఔట్ పుట్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా” అని అన్నారు.

ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం మాట్లాడుతూ..” ముందుగా మా సినిమాని ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీడియా వారికి, అందరికి కృతజ్ఞతలు.. నాకు ఇదే కొత్త. సినిమా రంగంలో ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడతాం” అని అన్నారు.

హీరో నవీన్ మాట్లాడుతూ.. ” ఈ సినిమా గురించి మాట్లాడే ముందు కాశ్మిర్ ఉగ్రదాడి గురించి మాట్లాడాలి. ఎందుకంటే దాని గురించి మాట్లాడే అవకాశం నాకు ఇప్పుడే వచ్చింది. నిజంగా ఆ ఘటన నన్ను బాధించింది. చాలా కోపంగా కూడా ఉన్నాను. ఈసారి మన అధికారులు పాకిస్తాన్ తీవ్రవాదులపై చేసే దాడి వాళ్ళు కలలో కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే.. నాపై నమ్మకంతో ఈ సినిమా మీద 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. చాలా మంచి ఔట్ పుట్ వచ్చింది. తప్పకుండా మీకు నచ్చుతుంది. ” అని అన్నారు.

నటుడు కార్తీక్ రత్నం మాట్లాడుతూ… “తెరచాప చిత్ర టీజర్ చాలా బాగుంది. నాకు లేటుగా తెలియడంతో వేరే పని ఉన్నప్పటికీ నవీన్ కోసం ఇక్కడికి వచ్చాను. నవీన్ రాజ్ కు నేను ఎంతో సపోర్ట్ గా నిలుస్తాను. దర్శకుడి మేకింగ్ అలాగే బిజిఎం ఇంకా సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందం అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అన్నారు.

ప్రధాన తారాగణం: నవీన్‌రాజ్ శంకరపు, శ్రీలు, పూజా సుహాసిని, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల
సహాయ తారాగణం: రాకీ, నాగ మహేష్, పృథ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్‌దస్త్, నాగి జబర్‌దస్త్, అప్పారావు జబర్‌దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేసా, మాయమశ్చంద్ర, సాకారం

బ్యానర్ : అనన్య క్రియేషన్స్
నిర్మాత: కైలాష్ దుర్గం
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్
సంగీత దర్శకుడు: ప్రజల్ క్రిష్ & ఎంఎల్ రాజా
ఎడిటింగ్: రాజు బొడసింగి
సంభాషణలు: జోయెల్ జార్జ్, మిడ్డే మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య
కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం
సంగీతం: ఆదిత్య మ్యూజిక్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago