మాటే మంత్రము” సినిమాలో కావ్యగా మేఘా ఆకాష్

రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా “మాటే మంత్రము”. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నదీ సినిమా.బుధవారం హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రెబల్ కావ్యగా మేఘా ఆకాష్ లుక్ సరికొత్తగా ఉంది.

హాకీ స్టిక్ పట్టుకుని స్మోక్ చేస్తున్న కావ్య డ్రీమ్స్, హాబీస్, ఎమోషన్స్ అన్నీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించారు. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందీ సినిమా. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…”ఇవాళ మా హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు. బర్త్ డే విశెస్ చెబుతూ ఆమె నటించిన కావ్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. కావ్య ఒక రెబల్ గర్ల్. మేఘా ఆకాష్ ను ఇప్పటిదాకా చూడని కొత్త క్యారెక్టర్ లో చూస్తారు. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తి చేశాం” అన్నారు.

నటీనటులు – రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్,అర్జున్ కళ్యాణ్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు
సాంకేతిక నిపుణులు – సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : రాజ్ కమల్, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి, పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్, నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం – అభిమన్యు బద్ది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago