హీరో కార్తి, ప్రిన్స్ పిక్చర్స్ సీక్వెల్ ‘సర్దార్ 2’రి

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం సర్దార్ తెలుగు,  తమిళంలో బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల రన్ లో అసాధారణమైన బిజినెస్ సాధించి, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. రాశి ఖన్నా, రజిషా విజయన్, లైలా ఈ సినిమాలోని ప్రముఖ తారాగణం.సర్దార్  పార్ట్ 2 చేయడానికి టీమ్ హింట్స్ఇచ్చింది. ఈరోజు టీమ్  ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. సర్దార్ సీక్వెల్ ఉంటుంది, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.కార్తీ పోషించిన సర్దార్ కొడుకు పాత్రను రా ఏజెంట్‌గా చేరమని ఆఫర్ చేయగా అతను అంగీకరించాడు.

నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోంది. సర్దార్ కోసం పనిచేసిన అదే టీమ్ సర్దార్ 2కి కూడా అసోసియేట్ అవుతుంది.సర్దార్ లో కార్తి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తి విలక్షణమైన నటన ప్రేక్షకులతో పాటు విమర్శకుని ఆకట్టుకుంది. దర్శకుడు మిత్రన్ బ్రిలియంట్ కంటెంట్ తో మెస్మరైజ్ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రానున్న ఈ సీక్వెల్ క్రేజీ ప్రాజెక్ట్ గా ప్రేక్షకులని అలరించబోతుంది.జార్జ్ సి విలియమ్స్ కెమెరా మెన్ గా పని చేయగా,  జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago