మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు.

ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది. దాంతో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయి. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

విశ్వంభర 2025 జనవరి10న విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Tfja Team

Recent Posts

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత…

23 minutes ago

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల…

59 minutes ago

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

1 day ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

1 day ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

1 day ago