టాలీవుడ్

వీరయ్య విజయ విహారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు మా బ్రదర్ లా వున్నారు. నేను, ఫ్యాన్స్ గుర్తుపెట్టుకునే చిత్రమిది: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

వాల్తేరు వీరయ్య గొప్ప గౌరవాన్ని ఇచ్చింది : దర్శకుడు బాబీ కొల్లి

 వాల్తేరు వీరయ్య ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ : నిర్మాత నవీన్ యెర్నేని

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) మెగా మాస్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ‘వాల్తేరు వీరయ్య’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ‘వీరయ్య విజయ విహారం’’ సక్సెస్ సెలబ్రేషన్స్ ని వరంగల్ హన్మకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరైన వీరయ్య విజయ విహారం’’వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా చిత్ర యూనిట్ కు షీల్డ్స్ ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. 

అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. నాన్ ఎస్ఎస్ఆర్ సినిమాల రికార్డ్స్ కి వచ్చిందంటే.. ఇంత గొప్ప విజయానికి అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది ప్రేక్షకులకే. ప్రేక్షకుల హృదయపూర్వక కృతజ్ఞతలు. వాల్తేరు వీరయ్య 250 కోట్ల గ్రాస్ కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఫీలింగ్ మీకు నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. నాపై అభిమానంతో బాబీ ఇండస్ట్రీకి రావడం, ఎప్పటికైనా నాతొ సినిమా చేయాలనీ కోరుకోవడం… అది మామూలు సినిమా కాలేదు. ఖైదీ సినిమా నాకు ఎలాంటి స్టార్ డమ్ తీసుకొచ్చిందో .. దర్శకుడిగా బాబీని వాల్తేరు వీరయ్య  ఒక స్టార్ డైరెక్టర్ ని చేసింది. బాబీ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం బాబీ పని చేసిన తీరుకు నేను అభిమాని అయిపోయాను. ఎక్కడ్డా వృధా లేకుండా బాబీ సినిమా చేశాడు. ఈ విషయంలో బాబీని యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకోవాలి. రవితేజ ని చూస్తే నాకు మరో పవన్ కళ్యాణ్ గా అనిపిస్తాడు. రవితేజతో ఇందులో కీలకమైన సన్నివేశం చేస్తున్నపుడు నాకు పవన్ కళ్యాణ్ నే గుర్తుకు వచ్చాడు. పవన్ అని ఊహించుకొని ఆ సీన్ చేశాను. అందుకే అది అంత అద్భుతంగా పండింది. అలాగే వాల్ పోస్టర్ సీన్ లో కూడా నా తమ్ముడిలానే చేశాను. షూటింగ్ చేస్తున్నపుడే థియేటర్ లో ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో ఊహించుకుంటాను. విజల్స్ చప్పట్లు నాకు చెవిలో మ్రోగుతూనే వుంటాయి. అభిమానుల అందించే ప్రోత్సాహం వలనే ఇంత ఉత్సాహంగా వుండగలుగుతున్నాను.ఇలాంటి వీరయ్యలు  ఎన్నైనా చేసే సత్తా ప్రేక్షకులు అభిమానులు ఇస్తున్నారు. దీనికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియస్తున్నాను. రంగస్థలం చేస్తున్నపుడు మైత్రీ మూవీ మేకర్స్ గురించి చరణ్ చెప్పేవాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలని చెప్పేవాడు. నేను మళ్ళీ సినిమాలు చేస్తే మాతో సినిమా చేసే అవాశం ఇవ్వండని మైత్రీ నిర్మాతలు కోరారు. అప్పుడే మాట ఇచ్చాను. ఇప్పుడు వాల్తేరు వీరయ్యతో ఓ అద్భుతమైన విజయంతో ఇది జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నిజమైన నిర్వచనంగా నిలబడ్డారు. వారికి సినిమా అంటే ప్రేమ. ఖర్చు గురించి ఎక్కడా అలోచించరు. ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో వచ్చాయి అంటే దానికి కారణం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలే. డీవోపీ ఆర్ధర్విల్సన్ చాలా అందంగా చూపించాడు. దేవిశ్రీ ప్రసాద్ మాస్, మెలోడీ, ఊరమాస్ నెంబర్స్ ఇచ్చాడు. రామ్ లక్ష్మణ్ పీటర్ హెయిన్స్ శేఖర్ మాస్టర్ అందరూ అద్భుతంగా చేశారు. శ్రుతి హాసన్ అద్భుతంగా చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, నాజర్ , సత్యరాజ్.. కోన వెంకట్, రైటర్ టీం, జి కే మోహన్ .. మిగతా సాంకేతిక నిపుణులు అందరూ చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు.  ఈ వేడుకకు వచ్చిన మంత్రి దయాకర్ రావు గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ తెలిపారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి అభినందనలు. నాకు రంగస్థలం లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చారు. నాకే కాదు వారితో పని చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. సినిమా అంటే అంకితభావం వున్న నిర్మాతలు. నిజంగా దమ్మున్న నిర్మాతలు. బాబీ గారికి బిగ్ కంగ్రాట్స్. వాల్తేరు వీరయ్య చూశాను  ప్రతి ఫ్రేం ని అద్భుతంగా మలిచారు బాబీ.. చిరంజీవి గారు మా నాన్న గారి లాలేరు.. మా బ్రదర్ లా వున్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. రవితేజ గారి తో ఒక డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దానిని కూడా మేము ఎంజాయ్ చేసేలా చేశాడు బాబీ. నిజంగా పూనకాలు లోడింగ్. నాతో పాటు అభిమానులందరికీ వాల్తేరు వీరయ్య గుర్తుండిపోయే చిత్రం. దేవిశ్రీ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. చిరంజీవి గారి కుటుంబంతో మాకు ఎంతో మంచి అనుబంధం వుంది. అలాగే చిత్ర నిర్మాత నవీన్ కూడా మాకు మంచి స్నేహితులు. నవీన్  చిత్ర పరిశ్రమలో మంచి విజయాలు అందుకోవడం ఆనందంగా వుంది. చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వరంగల్ లో స్టూడియో పెట్టె  ఏర్పాటు చేయాలని కోరుతన్నాను. ప్రభుత్వం తరపున సాయం చేయడానికి మేము సిద్ధంగా వున్నాం’’ అన్నారు.

బాబీ కొల్లి మాట్లాడుతూ.. ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చిరంజీవి అన్నయ్య జడ్జ్ మెంట్ తో ముందే నమ్మకం వచ్చింది. మా నాన్న గారు చిరంజీవి గారికి పెద్ద అభిమాని. నాన్న కాలం చేసిన తర్వాత వెంటనే షూటింగ్ కి రాగలిగానంటే దీనికి కారణం చిరంజీవి గారు. నాన్న గారికి నాలుగు నెలలు ముందే ఈ సినిమా రిజల్ట్ ని చెప్పి, మీ అబ్బాయి పెద్ద డైరెక్టర్ కాబోతున్నాడని  ఆయనకి సంతృప్తిని ఇచ్చి పంపించిన చిరంజీవి గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ప్రతి క్షణం ఈ సినిమాని ప్రేమించి ఈ సినిమా చేశాను. మా చిరంజీవి ని మాకు ఇచ్చావు అనే మాట అన్నయ్య అభిమానుల నుండి వింటూనే వున్నాను. వీరయ్య ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఇదంతా అన్నయ్య వలనే సాధ్యమైయింది. అన్నయ్య పై అభిమానంతో హైదరాబాద్ కి వచ్చి అన్నయ్య కెరీర్ లో నిలిచిపోయే వాల్తేరు వీరయ్యకి దర్శకుడు కావడం నా అదృష్టం. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య లేదని అన్నయ్య అన్నారు. అది నిజం. అన్నయ్య పై ప్రేమతో రవితేజ గారు ఈ సినిమానిచేశారు. దేవి శ్రీ ప్రసాద్ కి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రేమించి తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పీఆర్వో వంశీ శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు. 

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.‘వాల్తేరు వీరయ్య’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే .. ఈ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యుటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అంటున్నారు. 20 శాతం కమీషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 20 శాతంకంటే ఓవర్ ఫ్లో వస్తే దీనిని ఏమనాలి ?! ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనాలి. 13 నుండి వాల్తేరు వీరయ్య సర్ప్రైజ్  రిజల్ట్ ఇస్తూనే వుంది. మా అంచనాలకు మించి కలెక్ట్ చేస్తోంది. నా కెరీర్ ఇలాంటి రిజల్ట్ ఎప్పుడూ చూడలేదు. సినిమా విడుదలైనప్పటి నుండి ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకి చిరంజీవి గారికి కాల్ చేయడం, అద్భుతమైన రిజల్ట్ గురించి మాట్లాడుకోవడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్.  చిరంజీవి గారు ఈ సినిమా ‘ఖైదీ’ అంత విజయం అవుతుందని ఒకసారి మెసేజ్ పెట్టారు. నిజంగా అంత పెద్ద విజయం అవుతుందా అనే చిన్న అనుమానం వుండేది. కానీ నిజంగానే ఖైదీ తర్వాత అంత పెద్ద విజయం వాల్తేరు వీరయ్య అందుకుంది. చాలా ఆనందంగా వుంది. మాకు ఇంత విజయాన్ని ఇచ్చిన చిరంజీవి గారికి, బాబీకి, రవితేజ గారికి.. అందరికీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిధిగా వచ్చిన రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు

బివిఎస్ రవి మాట్లాడుతూ.. చిరంజీవి గారిని చూస్తూనే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎన్ని విజయాలు, ఇండస్ట్రీ హిట్లు కొట్టినా నేల పైనే వుండే వ్యక్తిత్వం ఆయనది. దర్శకులకు ఆయన గొప్ప గైడెన్స్. ఆయన ఏం చెప్పిన వినాల్సిన బాధ్యత మనది. వాల్తేరు వీరయ్యది మాస్ అమ్మా మొగుడు లాంటి విజయం’’అన్నారు.  

కోన వెంకట్ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య 250 కోట్లకు చేరుకుంటుంది. ఇంత గొప్ప విజయానికి వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారు. దర్శకుడు బాబీ చిరంజీవి గారిపై వున్న ప్రేమతో ఈ సినిమాని ప్రాణం పెట్టి తీశాడు. ఇందులో పని చేసిన అందరూ చిరంజీవి గారిని ప్రేమించి చేశాం. అందుకే ఇంత గొప్ప విజయం సాధ్యమైయింది. మైత్రీ మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు.

కెచక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ.. వీరయ్య స్క్రీన్ ప్లే ని ఒక కేస్ స్టడీ గా తీసుకోవాలని చిరంజీవి గారు చెప్పడం బిగ్గెస్ట్ కాంప్లీమెంట్. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక స్క్రీన్ ప్లే రైటర్ గా రవితేజ గారితో హ్యాట్రిక్ కొట్టాను. మైత్రీ మూవీ మేకర్స్ కి థాంక్స్’’ అన్నారు.

రోల్ రిడ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సమీర్, శకల శంకర్, రచ్చరవి, ప్రవీణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

TFJA

Recent Posts

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు…

14 hours ago

Allu Aravind Visits Sri Tej After Telangana Government’s Permission

Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…

15 hours ago

Ardham Chesukovu Enduke Song Released from Drinker Sai

Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…

15 hours ago

“డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…

15 hours ago

Jackie Chan And Ralph Macchio Return In The First Trailer of Karate Kid

The first trailer for Karate Kid: Legends has dropped, featuring the return of Jackie Chan…

15 hours ago

VB Entertainments 10th Anniversary Bulli Tera Awards

VB Entertainments 's Boppana Vishnu presented the Bulli Tera Awards 2023-2024 .On this occasion, a…

15 hours ago