మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోలా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 14.5 M+ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అన్న చెల్లెల బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణ.
అన్న చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్‌ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. కాబట్టి, భోళా శంకర్ ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదు. మాస్, యూత్, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుంది.
అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం, డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
సరికొత్త కథా నేపథ్యాలతో అద్భుతమైన మేకింగ్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే దర్శకుడు పా. రంజిత్ "వేట్టువం" టైటిల్ తో…
మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…
నటుడు నవీన్ చంద్ర హీరోగా, దర్శకుడు ఆర్.పి. బాల తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘NC 51’ షూటింగ్ పూర్తయింది. ఆర్.పి.…
▪️ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి.. తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించిన డా. అనిల్ విశ్వనాథ్…
నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…
ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…