రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..
నేపథ్యం…
నేను ఉద్యోగరిత్యా సాఫ్ట్ వేర్ అయినా కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆరేళ్ల క్రితం నాకు సినిమాల మీద ఓ ఆలోచన పుట్టింది. ఎప్పుడూ మనం సినిమాలను చూడటమేనా? మనం ఎందుకు తీయలేమని నాలో ఆలోచన పుట్టింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.
‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ సినిమా ఐడియా..
నిర్మాతగా ఓ కుటుంబంతోకలిసి అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఓ సినిమా తీయాలనుకున్నాను. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు ఇప్పట్లో అంతగా రావడం లేదు. నాకున్న ఆలోచనలే మా దర్శకుడు రాజేష్‌కి ఉండేవి. అలా మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ కథలో కొన్ని ఇన్ పుట్స్ కూడా నేను ఇచ్చాను.
హీరో రిష్మి గురించి..
కృష్ణ గాడు అంటే ఒక రేంజ్అని చాలా సార్లు చెబుతుంటాడు. అదే మాట ఊరి జనంతో చెప్పించాడా? లేదా అనేదే కథ. మా హీరో రిష్వి తిమ్మరాజులో కాస్త వెరైటీ, కొత్త స్పార్క్ కనిపించింది. ఆడిషన్స్‌కు పంపించిన వీడియోలు చూసి తీసుకున్నాం. హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది ఆడిషన్స్ చేశాం. చివరకు విస్మయని తీసుకున్నాం.తొలి సినిమా నిర్మాతగా..
ఇన్‌స్పిరేషన్…
సినిమా విడుదల విషయంలో దిల్ రాజు గారు, బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేస్తున్నారు. ఆగస్ట్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. మూవీని రిలీజ్ చేయడమే అతి పెద్ద విజయంగా అనిపిస్తోంది… అంటూ ఇంటర్వ్యూ ముగించారు ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ నిర్మాత నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…