‘మనమే’ కంప్లీట్ డిఫరెంట్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్:హేశం అబ్దుల్ వహాబ్

Must Read

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

హాయ్ నాన్న తర్వాత మళ్ళీ పేరెంట్స్ చైల్డ్ నేపధ్యంలో ‘మనమే’ వస్తుంది కదా.. కథ పరంగా ఈ రెండు చిత్రాలు ఎలాంటి డిఫరెన్స్ వుంటుంది ?
– హాయ్ నాన్న, మనమే కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్స్. రెండు వేరు వేరు కథలు. ఈ రెండు సినిమాలకి ఎక్కడా కంపేరిజన్ లేదు. మనమే చాలా డిఫరెంట్ ఎమోషన్స్ వున్న కథ.  కథ గురించి ఇప్పుడే ఎక్కువ రివిల్ చెయకూడదు. ‘మనమే’ ప్రోపర్ కమర్షియల్ ఫిల్మ్. ఇంత డిఫరెంట్ ఫిల్మ్ ని చేయడం ఇదే మొదటిసారి.

16 పాటలు వున్నాయని డైరెక్టర్ చెప్పారు. ఇందులో మ్యూజిక్ కి వున్న ప్రాముఖ్యత గురించి చెప్పండి?
– స్కోరింగ్ మొదలుపెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారు చాలా స్మార్ట్. ఆయన సినిమాని అద్భుతంగా మలిచి మంచి మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఇచ్చారు.  ఫస్ట్ హాఫ్ కంపోజ్ చేసినప్పుడే దాదాపు పది పాటలు వరకూ వచ్చాయి. సెకండ్ హాఫ్ కి మరో ఆరు పాటలు అవసరం అవుతాయని భావించాం. సినిమా కోసం16 పాటలు చేయడం నాకు ఇదే తొలిసారి.11 ప్రోపర్ సాంగ్ ట్రాక్స్. మరో ఐదు డిప్, బిట్ సాంగ్స్ గా వస్తాయి.

మీ కెరీర్ లో చాలా వరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేయడం ఎలా అనిపించింది ?
– ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ తో రావడం గాడ్ బ్లెస్సింగ్స్ గా భావిస్తాను. ఖుషి, హాయ్ నాన్న మ్యూజిక్ ని ఆడియన్స్ చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మనమే వస్తుంది. మనమే లో నా కంప్లీట్ మ్యూజిక్ నాలెడ్జ్ ని ఎక్స్ ప్రెషన్ చేయడానికి అవకాశం దక్కింది. చాలా ఇష్టంగా ఈ ప్రాజెక్ట్ చేశాను. నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కంటే చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాము.

మీరు ప్రతి సినిమాకి ఎదో కొత్తగా ప్రయత్నిస్తారు. మనమే లో ఎలాంటి కొత్తదనం వుంటుంది ?
-మనమే లో అడిషినల్ గా నెంబర్ అఫ్ సాంగ్స్ వచ్చాయి. సీన్స్, మాంటజస్ ని సాంగ్స్ ద్వారా బ్యూటీఫుల్ గా చెప్పడం జరిగింది. దర్శకుడు శ్రీరామ్ నాకు చాలా ఇన్స్ స్పైర్ చేశారు. మనమే మ్యూజికల్ ఫిల్మ్. ఇన్ని పాటలు చేయడం నాకూ ఒక ఎక్స్పరిమెంట్ లా అనిపించింది. ఇది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. కథకు అనుగుణంగానే పాటలు వస్తాయి. సాంగ్స్ నెరేటివ్ ని ఇంకా వండర్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తాయి.

16 పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి ?
-పర్శనల్ గా నాకు అన్ని ట్రాక్స్ ఇష్టమే. కొన్ని పాటలు మనసుకి చాలా దగ్గరగా వుంటాయి. మనమే చాలా యంగేజింగ్ గా వుంటుంది. గ్రేట్, న్యూ ఎక్స్ పీరియన్స్. సినిమా కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సినిమా చూసే వుంటారు.. శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ?
– శర్వానంద్ గారి వన్ అఫ్ ది బెస్ట్, క్లాసీ పెర్ఫార్మెన్స్ మనమే. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య అద్భుతంగా నటించారు. ఇందులో ఇంకొన్ని బ్యూటీఫుల్ క్యారెక్టర్స్ వున్నాయి. ఈ పాత్రలన్నీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా వుంటుంది ?
-బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మనమే లో గ్రేట్ మ్యజికల్ ఎక్స్ పీరియన్స్. దాదాపు రెండు నెలలు స్కోర్ కోసం పని చేశాం. మనమే కంప్లీట్ డిఫరెంట్ మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ ని సీట్లో అతుక్కునేలా చేస్తాయి.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల గురించి ?
-చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ ని చాలా గ్రాండ్ గా చేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా లావిష్ గా నిర్మించారు.  

మీరు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో పని చేస్తారు కదా.. తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది ?
-ప్రతి టెక్నిషియన్ కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వన్ అఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. ఈ పరిశ్రమలో భాగం కావడం ఆనందంగా వుంది. ఇక్కడ మ్యూజిక్ ని ఆడియన్స్  గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. హైదరాబద్ నా సెకండ్ హోమ్. ఇక్కడ చాలా గౌరవంగా ప్రేమగా చూస్తారు.

అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?
-రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వర్క్ చేస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News