మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు’, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ‘మీసాల పిల్ల’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, ‘శశిరేఖ’ పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన పాట ‘సంక్రాంతి అదిరిపోద్ది’ ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, ఒక మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది.
అనిల్ రావిపూడి ఇప్పటికే ఇది హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని హింట్స్ నేపథ్యంలో ట్రైలర్ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి విజువల్స్‌ను అందిస్తుండగా, తమ్మిరాజుఎడిటర్. ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ రైటర్స్.
మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12, 2026న థియేటర్లలోకి గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన యూఎస్‌ఏ అడ్వాన్స్ సేల్స్ అద్భుతంగా ప్రారంభమయ్యాయి. వేగంగా100K నమోదు కావడం, ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాపై ఉన్న మ్యాసీవ్ బజ్‌ను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు – సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ – శ్రీమతి అర్చన
సంగీతం – భీమ్స్ సిసిరోలియో
డీవోపీ – సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ – తమ్మిరాజు
రచయితలు – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ – సత్యం బెల్లంకొండ
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్ తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న హర్షవర్దన్ రామేశ్వర్ … ఇప్పుడు…
మైత్రీ మూవీ మేకర్స్ ప్రజెంట్స్, సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్టైన్మెంట్ 'జెట్లీ' హ్యుమర్ ఫిల్డ్ యాక్షన్ గ్లింప్స్ రిలీజ్…
యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైసన్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "రామమ్". ఈ రోజు ఈ యంగ్ స్టార్ హీరో పుట్టినరోజు…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
RS ఇన్ఫోటైన్మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో…