టాలీవుడ్

ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో మేక్ ఇట్ మెట్రో

ఆవిష్కరణముఖ్యఅతిథులుగా జయేష్ రంజన్, భవేశ్ మిశ్రా, తనికెళ్ల భరణి

హైదరాబాద్‌ వేదికగా టీ-వర్క్స్ కొత్త ఆవిష్కణలకు నాంది పలికింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌ నుంచి మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్‌లో ముఖ్యఅతిథులుగా ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు టీ-వర్క్స్ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని, తాను మెట్రో రైలు ఎక్కి చాలా రోజులైందని తెలిపారు. టీ-వర్క్స్ ప్రతినిధి అజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు మెట్ర్రో ఎక్కుతున్నారన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో టీ-వర్క్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్…

2 hours ago

Grand Launch the Movie Marrichettu Kinda Manollu

Under the banner of Sri Naarasimha Chitralaya, the film "Marrichettu Kinda Manollu" was officially launched…

2 hours ago

సుమంత్ ప్రభాస్, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తన తొలి మూవీ ‘మేం ఫేమస్‌’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన…

3 hours ago

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline…

1 day ago

డ్రింకర్ సాయి సినిమా నుంచి ‘నువ్వు గుద్దితే..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…

1 day ago

Aaron Taylor-Johnson Gives Fans An Insight Into How He Got Into Shape For Kraven The Hunter

Aaron Taylor-Johnson is arguably one of the fittest stars out there and his physical transformation…

1 day ago