ఆవిష్కరణముఖ్యఅతిథులుగా జయేష్ రంజన్, భవేశ్ మిశ్రా, తనికెళ్ల భరణి
హైదరాబాద్ వేదికగా టీ-వర్క్స్ కొత్త ఆవిష్కణలకు నాంది పలికింది. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి మేక్ ఇట్ మెట్రో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈవెంట్‌లో ముఖ్యఅతిథులుగా ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు టీ-వర్క్స్ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ మెట్రోస్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని, తాను మెట్రో రైలు ఎక్కి చాలా రోజులైందని తెలిపారు. టీ-వర్క్స్ ప్రతినిధి అజయ్ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు మెట్ర్రో ఎక్కుతున్నారన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో టీ-వర్క్స్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.