టాలీవుడ్

హీరో ఆకాష్ పూరి క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం

మహీంద్ర పిక్చర్స్ పతాకంపై చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి జంటగా చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని సత్యసాయి కల్యాణమండపం లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్ పూరి హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నివ్వగా, ప్రొడ్యూసర్ రావ్ బోయపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 

చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. నేను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు నిర్మాత వి.శ్రీనివాస రావ్ గారు. వారికి నా ధన్యవాదాలు. హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు లు వచ్చి మమ్మల్ని బ్లేస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయి.ఈ సినిమాకు అందరూ కొత్త వారైనా చాలా మంది సీనియర్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేస్తున్నందున ఈ సినిమా కొత్త వారు తీసినట్టు ఉండదు. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్ జరుపుకొని హైదరాబాద్ లో జరిగే రెండవ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేసుకొంటామని అన్నారు.

చిత్ర నిర్మాత వి.శ్రీనివాస రావ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో ఆకాష్ పూరి,నిర్మాత వి. రావు గార్లకు ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా.దర్శకుడు వెంకటేష్ గారు చెప్పిన కథ నచ్చడంతో మహీంద్ర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాను. ప్రేక్షకులందరికి నచ్చేవిధమైన అన్ని అంశాలతో వస్తున్న ఈ సినిమా మా బ్యానర్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర హీరో చైతన్య పసుపులేటి మాట్లాడుతూ.. ఇది నా మూడవ సినిమా వెంకటేష్ గారు నా మెదటి సినిమా నుండి తెలుసు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.మంచి టీం, మంచి కథతో తీస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ..బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది సినిమాలో హీరోయిన్ గా నటించాను. ఆ సినిమా నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత విజయదేవరకొండ “ఖుషి” సినిమాలో, అనంత సినిమాలలో హీరోయిన్ సినిమాలలో నటిస్తున్న నాకు సస్పెన్సు థ్రిల్లర్ వంటి మంచి కథలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.

కెమెరామెన్ సుధాకర్ మాట్లాడుతూ..కెమెరామెన్ గా నాకిది ఐదవ సినిమా.విజయ దశమి సందర్బంగా ఈ మూవీ ఓపెనింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్వరూప్ – హర్ష లు మాట్లాడుతూ..ఈ సినిమాకు మంచి సాహిత్యం తో కూడిన అద్భుతమైన మెలోడీ పాటలు అందిస్తున్నాము..ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ విజయదశిమి రోజు ఈ సినిమా ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు

నటీ నటులు
చైతన్య పసుపులేటి ,రితిక చక్రవర్తి, శివకుమార్ రామచంద్ర వరపు, కరణ్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : మహీంద్ర పిక్చర్స్
నిర్మాత : వి.శ్రీనివాస రావ్
తమిళ్ ప్రెజెంటర్ : సాయి కార్తిక్ గౌడ్, జాడి
రైటర్ & డైరెక్టర్ : చిన్న వెంకటేష్ ,
డి. ఓ. పి: సుధాకర్ అక్కిన పల్లి
సంగీతం స్వరూప్ – హర్ష
పి. ఆర్ ఓ : మధు వి. ఆర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

5 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago