అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!

రాజశ్యామల ‌ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేసారు.

ఈ సందర్బంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మహేంద్రగిరి వారహి టీజర్ చాలా బాగుంది, పాజిటీవ్ ఫీలింగ్ కలిగింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సూపర్ మ్యూజిక్ తో టీజర్ ఉంది, థియేటర్స్ లో ఈ సినిమా విజయం సాధిస్తుందని అనిపిస్తుంది, రంగమార్తాండ సినిమా తీసిన మంచి అభిరుచిగల నిర్మాత మధు గారు ఈ సినిమాను తీశారు అలాగే లక్ష్మణ్ గారు ఈ సినిమాకు మరో నిర్మాత ఆయనకు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, అనుప్ రూబెబ్స్ సూపర్బ్ రీ రికార్డింగ్ ఇచ్చారు, సంతోష్ జాగర్లపూడి విజన్ బాగుంది, ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన సుమంత్ గారు ఈ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నను “ అన్నారు.

మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

సుమంత్ , మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు కథ మురళి.

ఈ చిత్ర టీజర్ పై సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది, మహేంద్రగిరి వారాహి టీజర్ విజువల్ గా ఆకట్టుకుంటుంది, రిచ్ విజువల్స్ మరియు ప్రామిసింగ్ సీజి వర్క్ తో గ్రాండ్ గా ఈ టీజర్ ఉందని అంటున్నారు , టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఒక శాపం వెనుక ఉన్న రహస్యాన్ని, ఒక ఊరిలో జరుగుతున్న వరుస చావుల మిస్టరీని ఛేదించే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సుమంత్ రోల్ ఉండబోటింది . అసలు ఆ శాపం వెనుక కథ ఏంటి.. ? ఆ శాపం ఎప్పుడు పోతుంది.. ? సుమంత్ కి హెల్ప్ చేసే ఐశ్వర్య రాజేష్ ఎవరు.. ? అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది . విజువల్స్ చాలా గ్రాండ్‌గా, ముఖ్యంగా వారాహి అమ్మవారి ఉగ్రరూపం చూపించిన షాట్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.అనుప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వారాహి మంత్రం టీజర్‌ను సరికొత్త లెవెల్‌కు తీసుకెళ్లాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, నిర్మాతలు మధు, లక్ష్మణ్ సినిమాను అద్భుతంగా తెరాకెక్కించారు.

సుమంత్ కు తన కెరీర్ లో మహేంద్రగిరి వారాహి సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోయే సినిమాగా నిర్మాత కాలిపు మధు ఈ సినిమాను రూపొందించారు, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago