హీరో శివకార్తికేయ, మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న పొలిటికల్ డ్రామా మహావీరుడు. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ లోకి వెళితే.. శివకార్తికేయన్ వార్తాపత్రికలో పనిచేసే కార్టూనిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. అనుకోకుండా ఓ రాజకీయ నాయకుడి పోస్టర్ చించడం వలన ఇబ్బందుల్లో పడతాడు. ఇందులో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. శివకార్తికేయన్ పైకి చూసినపుడు భిన్నమైన వ్యక్తిగా మారడం ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ చాలా ఎక్సయిటింగా వుంది.
డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శివకార్తికేయన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. మిస్కిన్ విలన్‌గా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. విధు అయ్యన్న కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో యోగి బాబు, సరిత వంటి స్టార్ తారాగణం కూడా ఉంది.
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. జూలై 14న మహావీరుడు విడుదల కానుంది.
తారాగణం: శివకార్తికేయన్, యోగి బాబు, సునీల్, మిస్కిన్, సరిత తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – అరుణ్ వజ్రమోను, కుమార్ గంగప్పన్
సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో…
సూపర్ ఇంట్రెస్టింగ్ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్ ఓటిపి టీమ్. ఒకరికి తెలియకుండా…
మలయాళ సూపర్‌స్టార్..కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియన్ లెవెల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అన్ని…
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా OG (‘ఓజీ’). DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ…
నవరాత్రి శుభారంభం సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘మర్దానీ 3’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంచి, చెడుకి జరిగే పోరాటాల్ని…