“మహానటులు” ట్రైలర్ రిలీజ్, ఈ నెల 25న మూవీ విడుదల
దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కించిన కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మించారు. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జాతిరత్నాలు తరహాలో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “మహానటులు” సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “మహానటులు” ట్రైలర్ ఆకట్టుకుంది. ముగ్గురు జాబ్ లెస్ లేజీ కుర్రాళ్లు స్టాండప్ కమెడియన్ శీను, ఫిలిం క్రిటిక్ టీబీ, మీమర్ పరదేశి లైఫ్ ను సరదాగా చూపించారు దర్శకుడు అశోక్ రెడ్డి. ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ కావడంతో వీళ్ల లైఫ్ లో జోష్ స్టార్టవుతుంది. కానీ ఆ అమ్మాయి మనిషా, దెయ్యమా అనే సందేహాలతో కథలో ట్విస్ట్ మొదలై ఏ ముగింపు తీసుకున్నాయి అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. “మహానటులు” సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి కథ, మాటలు – పి సుధీర్ వర్మ, సినిమాటోగ్రఫీ – సిద్ధం నరేష్, మ్యూజిక్ – మార్కస్ ఎం, ప్రొడక్షన్ డిజైనర్ : రాజశేఖర్ ఎడిటింగ్ – కార్తీస్ కట్స్, ఆర్ట్ – హేమంత్ కుమార్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాతల -అనిల్ బోధిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి, దర్శకత్వం – అశోక్ కుమార్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం'. కావ్యా…
విభిన్న భాషల్లోని ఓటీటీ వేదికలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు భాషలో మాత్రం ఆహా ఓటీటీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా…
హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా "కోడి బుర్ర". అల్లుకున్న కథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని…
The new film "Kodi Burra," starring hero Sriram, is currently in production. The film's subtitle…
Young and talented hero Kiran Abbavaram stars in the highly anticipated period thriller "KA." The…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక,…