మాచో హీరో గోపీచంద్ తన 31వ చిత్రం కోసం ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్షతో చేతులు కలిపారు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 14గా కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ఈ అద్భుతమైన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పూజా కార్యక్రమం ఈరోజు చిత్ర యూనిట్ సమక్షంలో లాంఛనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ”మా ప్రొడక్షన్ నంబర్ 14లో హీరో గోపీచంద్, దర్శకుడు హర్షతో కలసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది” అన్నారు.
కన్నడలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హర్ష, భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. గోపీచంద్ ఇంతకు ముందు కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు చేసినప్పటికీ, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, ఇతర ఎలిమెంట్స్ తో కూడిన మాసీవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.
ఈ చిత్రంలో కొంత మంది అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్.
త్వరలో ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలను మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
తారాగణం: గోపీచంద్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కెకె రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డీవోపీ: స్వామి జె
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
పీఆర్వో: వంశీ-శేఖర్