‘మా నాన్న సూపర్ హీరో’ నా కెరీర్ లో మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్

Must Read

-నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన నవ దళపతి సుధీర్ బాబు, అభిలాష్ రెడ్డి కంకర, వి సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మా నాన్న సూపర్ హీరో’ హార్ట్ వార్మింగ్ టీజర్‌ను- అక్టోబర్ 11న థియేట్రికల్ రిలీజ్

నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మా నాన్న సూపర్ హీరో’ తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్‌టైన్‌మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు నేచురల్ స్టార్ నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

తన తండ్రితో సుధీర్ బాబుకు ఉన్న డీప్ ఎమోషనల్ బాండ్ ని టీజర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సుధీర్ బాబు సాయాజీ షిండే, సాయి చంద్ ఇద్దరినీ నాన్న అని పిలుస్తుంటాడు. సాయాజీ షిండే పాత్ర అతని పట్ల అయిష్టత చూపిస్తుండగా, సాయి చంద్ పాత్ర సుధీర్ బాబుతో మంచి అనుబంధం వుంటుంది. తన కొడుక్కి క్యాన్సర్ ఉందనే నెపంతో తన తండ్రి ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నాడని తెలిసి సుధీర్ బాబు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో టీజర్ ఆకట్టుకునేలా ముగిసింది.

తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో సుధీర్ బాబు కూల్ గా కనిపించారు. సాయాజీ షిండే, సాయి చంద్ విభిన్న పాత్రలలో ఆకట్టుకున్నారు. టీజర్‌లో రాజు సుందరం పాత్రను పరిచయం చేశారు. సాయాజీ షిండే, సాయి చంద్‌లతో సుధీర్ బాబుకు ఉన్న రిలేషన్స్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర మూడు ప్రధాన పాత్రలను ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాడు. సమీర్ కళ్యాణి విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. జై క్రిష్ హార్ట్ టచ్చింగ్ స్కోర్‌తో ఎమోషనల్ అప్పీల్‌ని ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్. అభిలాష్ రెడ్డి కంకర, MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల రైటర్స్ గా పని చేస్తున్నారు. టీజర్ ద్వారా అనౌన్స్ చేసినట్లు, మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11 న విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుధీర్ బాబు సన్ అఫ్ పోసాని నాగేశ్వరరావు. మాకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి నాన్న అహర్నిశలు కష్టపడేవారు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన నాన్నకి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నాన్న గురించి ఎంత చెప్పినా సరిపోదు. టీజర్ చూస్తే ఈ సినిమా థీం అందరికీ అర్ధమైవుంటుంది. ఇది మార్వల్ సూపర్ హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో వుంది. ఆ పవర్ పేరు ప్రేమ. ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే లవ్ స్టొరీ ఇది. కథ విన్నప్పపుడు ఎంత ఇష్టపడ్డానో , చేసినప్పుడు అంతే ఇష్టంగా చేశాను. మీరు చూసినపుడు కూడా అంతే ఇష్టంగా ఈ సినిమా చూస్తారనే నమ్మకం వుంది. మనందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ‘నాన్న’. నాకు హార్ట్ ఫుల్ గా నచ్చిన సినిమా ఇది. నా కెరీర్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇది. మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ అభిలాష్ తో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తన ట్యాలెంట్ ని అక్టోబర్ 11న ఆడియన్స్ విట్నెస్ చేస్తారు. నిర్మాతలు వంశీ, సునీల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా కలసి సినిమాలని డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. వారి బ్యానర్ లో నేను హీరోగా చేయడం డ్రీం ఫర్ మీ. ఇందులో కొత్త సాయాజీ షిండే ని చూస్తారు. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. సాయి చంద్ గారు టెర్రిఫిక్ గా చేశారు. చాలా మంచి రోల్ అది. ఆర్ణ చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి మంచి పేరు వస్తుంది. శశాంక్ చాలా యీజ్ తో నటించారు. జై క్రిష్ మ్యూజిక్ అద్భుతంగా వుంటుంది. డీవోపీ సమీర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. టీం అందరికీ థాంక్ యూ. సోషల్ మీడియాలో టీజర్ ని లాంచ్ చేసిన నానికి థాంక్ యూ. టీజర్ తనకి చాలా నచ్చింది. ఇందులో నేను చేసిన పాత్ర ఎగ్జాట్ గా మా నాన్నగారే. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. అక్టోబర్ 11న ఫ్యామిలీతో కలసి థియేటర్స్ కి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

యాక్టర్ సాయాజీ షిండే మాట్లాడుతూ.. నా కెరీర్ లో చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా చేసినందుకు గర్వంగా వుంది. సుధీర్ బాబు కి ఫాదర్ గా యాక్ట్ చేయడం ప్రౌడ్ గా వుంది. ఈ సినిమా చేసినప్పుడు నాన్న గుర్తుకు వచ్చారు. ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూడండి. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి’ అన్నారు.

హీరోయిన్ ఆర్ణ మాట్లాడుతూ.. మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. ఇంత బ్యూటీఫుల్ ఫిలిం లో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. చాలా మంచి ఎమోషన్ వున్న సినిమా ఇది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు’ తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ.. నాకు మ్యూజిక్ పరిచయం చేసిన నాన్న , తర్వాత ఆ భాద్యత తీసుకున్న అమ్మ నా సూపర్ హీరోస్. అభిలాష్ కి థాంక్. ఈ సినిమాలో సుధీర్ బాబు గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. పాటలు చాలా బావొచ్చాయి. సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

యాక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అమ్మ నాన్న నా సూపర్ హీరోస్. మా నాన్న సూపర్ హీరో బ్యూటీఫుల్ స్టొరీ. థియేటర్స్ కి రండి. సినిమాని లవ్ చేస్తారు. కొత్త సుధీర్ బాబుని చూస్తారు. మీ అందరితో కలసి సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

డైరెక్టర్ అభిలాష్ కంకర మాట్లాడుతూ.. మై ఫాదర్ ఈజ్ మై సూపర్ హీరో. నేను ఇక్కడ ఉండటానికి కారణం కూడా మా నాన్నే. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఫాదర్ సన్ మధ్య జరిగే బ్యూటీఫుల్ స్టొరీ ఇది. ఈ సినిమా చేయడానికి బ్యూటీఫుల్ టీం దొరికింది. నిర్మాతలు వంశీ గారు సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఇది హార్ట్ వార్మింగ్ ఫిలిం అవుతుంది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు

తారాగణం: సుధీర్ బాబు, ఆర్ణ, సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: వి సెల్యులాయిడ్స్
అషోషియేషన్ విత్: CAM ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాత: సునీల్ బలుసు
డీవోపీ: సమీర్ కళ్యాణి
సంగీతం: జై క్రిష్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: మహేశ్వర్ రెడ్డి గోజాల
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ గోజాలా
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కొరియోగ్రఫీ: రాజు సుందరం
రైటర్స్: MVS భరద్వాజ్, శ్రవణ్ మాదాల, అభిలాష్ రెడ్డి కంకర
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News