*సినీ ప్రముఖుల చేతుల మీదగా పూజ కార్యక్రమాలతో #LUB చిత్ర ప్రారంభం*


జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB. ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్ గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా, లిరికల్ రైటర్ గా జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస మౌళి పని చేయనున్నారు. ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఈ చిత్రానికి క్లాప్ చేయగా హనుమాన్ చిత్ర నిర్మాత చైతన్య రెడ్డి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్ చిత్ర దర్శకుడు మణికంఠ దర్శకత్వం చేయగా స్క్రిప్టును క్రేజీ కల్యాణం చిత్ర నిర్మాత బి జగన్ మోహన్ రెడ్డి గారు, బివిఎస్ రవి గారు అందజేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన సంబరాల ఏటిగట్టు చిత్ర దర్శకుడు రోహిత్ కెపి, దర్శకుడు సముద్ర, నిర్మాతలు లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఈ చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా నటుడు పవన్ కేసరి మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులకు, మీడియా వారికి ధన్యవాదాలు. జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ పై రానున్న #LUB చిత్రం రోమ్ కోమ్, కామెడీ, లవ్ తో కూడిన ఎమోషన్ ఉన్న చిత్రం. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం పని చేస్తున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. చాలా మంచి కథతో మేము ఈ సినిమా మొదలుపెట్టాము. ఈ సినిమా కోసం కష్టపడి పని చేస్తాము” అన్నారు .

నటి ప్రాముఖ్య మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. మా చిత్రానికి సపోర్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్స్. ఇది నా తొలి చిత్రం. నా ఆడిషన్ చూసి నాకు చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు థాంక్స్. సినిమాలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమా టీం అంతా కొత్త వారే. చిత్ర బృందం అందరితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… “మేము ఒక మంచి కథతో సినిమా చేయాలి అనే ప్యాషన్ తో చిత్ర పరిశ్రమకు వచ్చాము. మాకు సపోర్ట్ గా నిలిచిన మా దర్శకుడు, హీరోకు థాంక్స్. వారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. మంచి కంటెంట్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాము. కొత్తవారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నాము. మా హీరోయిన్ బాల నటిగా ఇప్పటికే కొన్ని సినిమాలలో చేశారు. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

చిత్ర దర్శకుడు మణికంఠ మాట్లాడుతూ… “మా చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఈ సినిమా ఎమోషన్స్ తో ఒక రొమాంటిక్ డ్రామాగా ఉండబోతుంది. సినిమాకు సపోర్ట్ మీడియా వారికి, పిఆర్ఓ మధు గారికి థాంక్స్” అన్నారు.

అలాగే చిత్ర బృందం అందరూ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చి తమకు సపోర్ట్ చేసిన అతిధులకు, మీడియా వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపి తమ సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని, ఒక మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని తెలిపారు.

నటీనటులు : పవన్ కేసరి, ప్రాముఖ్య, అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, భాను ప్రకాష్ కడియాల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, మోత రాజేందర్ తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్స్ : జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్
దర్శకుడు : మణికంఠ పెదమల్లు
నిర్మాతలు :మహేష్ కుమార్ సంక, భగవాన్ (సంక బ్రోస్)
సహ నిర్మాతలు : పవన్ సుత సంక, రామతులసి సంక
డిఓపి : అక్షయ్ వసూరి
క్రియేటివ్ డైరెక్టర్ : భరత్ ఆకుల
సంగీత దర్శకుడు : సుధ శ్రీనివాస్
ఎడిటర్ : కార్తికేయన్ రోహిణి
లిరిక్స్ రైటర్ : శ్రీనివాస మౌళి
కొరియోగ్రాఫర్ : ఈశ్వర్ పెంటి
ఆర్ట్ డైరెక్టర్ : కార్తీక్ ఆకవరం
ఎక్జిక్యూటివ్ నిర్మాత : ఐజి సంతోష్
రైటర్స్ టీం : విజయ్, నాగేంద్ర, అఖిల్, కేశవ్, భరద్వాజ్ చిలుకూరు
డైరెక్షన్ టీమ్ : శివ సిహెచ్, అఖిల్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం 

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

2 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

2 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

2 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago