ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువతలో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
– మాది వనపర్తి. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్న స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. అన్న, వదిన బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు. టెన్త్ తర్వాత నాకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు. హైదరాబాద్ లో డిగ్రీ చదివి, ఆ తర్వాత మాస్టర్స్ కోసం యూకే వెళ్ళాను. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్ చేసిన నేను, యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆరు నెలల తర్వాత కలర్స్ స్వాతి గారితో ‘టీచర్’ అనే సినిమా చేశాను. నవీన్ మేడారం గారు, అభిషేక్ నామా గారు నిర్మించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. యూకేలో నేను చదువుకున్న యూనివర్సిటీలో నవీన్ గారు సీనియర్. సినిమాల పట్ల ఆసక్తితో ఆయనను సంప్రదించి, పరిచయం చేసుకున్నాను.
90s వెబ్ సిరీస్ అవకాశం ఎలా వచ్చింది?
– మా నాన్న గారి నిజజీవితం ఆధారంగా 90s కథ రాసుకున్నాను. మొదట ఒక ఓటీటీ సంస్థ ఆ కథ నచ్చి, నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ, ఆరు నెలల తర్వాత వెనకడుగు వేశారు. అప్పటికే ఆ కథ గురించి తెలిసిన ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు పిలిచారు. అలా 90s వెబ్ సిరీస్ తెరపైకి వచ్చింది.
మీకు ఆదిత్య హాసన్ పేరు ఎలా వచ్చింది?
– నా అసలు పేరు ఆదిత్య. నేను కమల్ హాసన్ గారి వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నా పేరును ఆదిత్య హాసన్ గా మార్చుకున్నాను.
‘ఎపిక్’ సినిమా మీ బయోపిక్ అంటున్నారు నిజమేనా?
– నిజ జీవిత సంఘటనల స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ, నా జీవితం మాత్రం అంత అందంగా లేదు (నవ్వుతూ). ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాము. 90s సిరీస్ లో కూడా మా ఊరిపేరు, మా కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. కానీ, అందులోని ప్రతి సంఘటన మా జీవితంలో జరిగినట్లు కాదు. వివిధ జీవితాల్లోని సంఘటనలను తీసుకొని, ఒక కథగా రాసుకోవడం జరిగింది.
‘ఎపిక్’ సినిమా ఎలా ఉండబోతుంది?
– ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మన నిజ జీవితంలోని కొన్ని కొన్ని అందమైన సంఘటనల ఆధారంగా కథ ఉంటుంది. 90s సిరీస్ కు ఇది సీక్వెల్. అందులోని తమ్ముడి పాత్రకు సంబంధించిన జీవితంలోని ఒక భాగం ఎపిక్ కథగా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఒక కథగా, అక్క జీవితాన్ని ఒక కథగా చూపించే ఆలోచన ఉంది.
‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి?
– ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ కథకు కొనసాగింపు ఉంటుంది. ‘ఎపిక్- ఫైనల్ సెమిస్టర్’ పేరుతో ఆ కథ కొనసాగుతుంది. మొదటి భాగంలో ముగింపు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల కోణంలోనో, దర్శకుడి కోణంలోనో కాకుండా ఆ కథకు ఎలాంటి ముగింపు అవసరమో, అలాంటి క్లైమాక్స్ రాయడం జరిగింది.
బేబీ జోడితో సినిమా చేయడం ఏమైనా ఒత్తిడి అనిపించిందా?
– మొదట్లో అనిపించింది. కానీ, దానిని బ్రేక్ చేసేలా ‘ఎపిక్’ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. హీరోగా ఆనంద్ ను నేనే ఎంపిక చేశాను. హీరోయిన్ గా వైష్ణవి పేరుని నిర్మాత నాగవంశీ గారు సూచించారు. ‘బేబీ’ కాంబో కమర్షియల్ గా హెల్ప్ అవుతుందని ఆయన అన్నారు. అప్పుడు ఆయన అన్నప్పుడు అర్థం కాలేదు కానీ, తర్వాత సినిమాపై వచ్చిన హైప్ చూశాక ఆయన చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది.
‘ఎపిక్’ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు?
– ఇది గొప్ప కథ అని చెప్పను. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది కథ. 90s ఎలాగైతే సహజంగా ఉంటుందో, ఎపిక్ కూడా అంతే సహజంగా ఉంటుంది. కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుండిపోతాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు. పైగా, నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది కొత్తగా ఉంటుంది అనిపించి, ఈ కథ ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్నాను.
నిర్మాత నాగవంశీ గారి గురించి?
– 90s వెబ్ సిరీస్ చూసి, నన్ను నమ్మి నాగవంశీ గారు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతిదీ దగ్గరుండి వంశీ గారు చూసుకున్నారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఎంపిక కూడా వంశీ గారిదే.
గోరటి వెంకన్న గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
– నాకు చిన్నప్పటి నుంచి గోరటి వెంకన్న గారంటే అభిమానం. నేను లండన్ లో చదువుకునే రోజుల్లో కూడా ఆయన పాటలే వింటూ ఉండేవాడిని. నా మొదటి సినిమాలో ఖచ్చితంగా ఆయన పాట ఉండాలి అనుకునేవాడిని. అందుకే ఎపిక్ సినిమాలో గోరటి వెంకన్న గారితో ‘సంచారమే’ రాయించి, పాడించి.. ఆ పాటతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాము.
మీకు ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది?
– అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. వినోదాన్ని అందిస్తూనే, విభిన్న జానర్ సినిమాలు చేయాలని ఉంది. ఎవరినీ కించపరచకుండా, ఎటువంటి అజెండాలు లేకుండా విలువలతో కూడిన సినిమా అందించాలనేది నా లక్ష్యం.
జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…