టాలీవుడ్

“లవ్ రెడ్డి” గెలిచాడు ఇండస్ట్రీ నుంచి చిన్న సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం అంజన్ రామచంద్ర

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మించారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా నిన్న ( 18వ తేదీ) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ మదన్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ – “లవ్ రెడ్డి” సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు. సినిమాను ఎలాగైనా నిలబెట్టండి అంటూ మెసేజ్ లు పంపుతున్నారు. నాకు వాళ్లకు తోచిన అమౌంట్స్ యూపీఐ ద్వారా పంపిస్తున్నారు. “లవ్ రెడ్డి” సినిమాతో మా హీరోకు పేరొచ్చింది. మా హీరోయిన్ కు పేరొచ్చింది, మా డైరెక్టర్ కు పేరొచ్చింది. నిర్మాతగా ఆ సంతృప్తి నాకు చాలు. కిరణ్ అబ్బవరం గారు ఫ్రీ షోస్ వేశారు. ఆ ఫ్రీ షోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. “లవ్ రెడ్డి” లాంటి మంచి చిత్రానికి మరింతగా మీ ఆదరణ చూపిస్తారని కోరుకుంటున్నాం. థియేటర్స్ లో చూసిన వాళ్ల నుంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. చూడని వారు రేపు ఓటీటీలో అయినా చూస్తారు కాబట్టి మా టీమ్ ప్రతిభ తప్పకుండా తెలుస్తుంది. అన్నారు.

డైరెక్టర్ స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ – మా “లవ్ రెడ్డి” సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ అంటున్నారు. అయితే సినిమాను ప్రేక్షకుల దగ్గరకు మరింతగా రీచ్ చేయడంలో మేము ఫెయిల్ అయ్యాం. అది ఒప్పుకుంటున్నాం. కొన్ని యదార్థ ఘటనలకు ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ సినిమాను రూపొందించాను. మొదట్లో మా మూవీని దీపావళికి రిలీజ్ అనుకున్నాం. అయితే అప్పుడు కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కు అనౌన్స్ అవుతున్నాయి. స్టార్స్ మూవీస్ మధ్యలో మా చిన్న సినిమా నలిగిపోతుందని ఇప్పుడు రిలీజ్ కు వచ్చాం. మా మూవీని ఆడియెన్స్ కు రీచ్ చేయడంలో తగినంత టైమ్ దొరకలేదు. మూడేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. ఇందులో ఏడాది పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ మీద స్పెండ్ చేశాం. ఇదంతా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకే. అందుకే ప్రేక్షకులు టీవీలో కాకుండా థియేటర్ లోనే మా సినిమా చూడాలని మేమంతా కోరుకుంటున్నాం. మంచి సినిమాను బతికించమని మా టీమ్ అంతా రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నారు.

హీరోయిణ్ శ్రావణి మాట్లాడుతూ – “లవ్ రెడ్డి” సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నాకు కనీసం రెండు వేల మెసేజ్ లు వచ్చాయి. సినిమా చూశాక కొందరు నాతో మాట్లాడుతూ ..మేడమ్ మీరు చాలా బాగా నటించారు. కానీ కొత్త వాళ్ల సినిమాకు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా అని అన్నారు. కానీ ఇప్పుడున్న స్టార్స్ అంతా ఒకప్పుడు కొత్త వాళ్లే కదా. కొత్త టీమ్ వర్క్ చేసినా మీ ఆదరణ “లవ్ రెడ్డి”కి చూపిస్తారని ఆశిస్తున్నా. మా సినిమా క్లైమాక్స్ గురించి ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. ఎంతటి రాతిగుండెలైనా కరిగించేలా క్లైమాక్స్ ఉందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. ఒక మంచి థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ కోసం మా మూవీ చూడండి. అన్నారు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ – మా మూవీకి ఆడియెన్స్ నుంచే కాకుండా ప్రెస్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. “లవ్ రెడ్డి” థియేటర్ లో గెలిచాడు. చూసిన వాళ్లంతా బాగుందని అంటున్నారు. ఎవరికైతే మా సినిమా రీచ్ కాకుండా వాళ్లు చూడలేకపోతే అది మా ఫెయిల్యూర్ గా భావిస్తాం. ప్రతి సినిమాలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అయితే ఓవరాల్ గా “లవ్ రెడ్డి” సినిమాకు మూవీ చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారనే చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మంచి సినిమాను ఆదరించడంలో ఫెయిల్ కాలేదు. వాళ్లను ఫెయిల్ చేయొద్దనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రీమియర్స్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీని హ్యాపీగా రిలీజ్ చేశాం. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ నుంచి మా మూవీకి పూర్తి సపోర్ట్ దొరికింది. ప్రమోషన్స్ పరంగా మేము ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయాం. “లవ్ రెడ్డి”ని ఎలాగైనా నిలబెట్టాలని నా స్నేహితుడు కిరణ్ అబ్బవరం హైదరాబాద్ , తిరుపతి, వైజాగ్, విజయవాడలో ఫ్రీ షోస్ అరేంజ్ చేశాడు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఫ్రీ షోస్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు తమ లైఫ్ లో జరిగిన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెబుతూ ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఓటీటీలో మా సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయితేనే మా ప్రొడ్యూసర్ కు డబ్బులు వస్తాయి. ఈ వీకెండ్ లోపు మా సినిమా బాగా పికప్ అవుతుందనే గట్టి నమ్మకంతో టీమ్ అంతా ఉన్నాం. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మా మూవీకి చిన్న సపోర్ట్ దొరుకుతుందని ఎదురుచూస్తున్నాం. అన్నారు

నటీనటులు – అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం – ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – రవీంద్ర రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)
సహా నిర్మాతలు – సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా
నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

Tfja Team

Recent Posts

Dulquer Salman on Unstoppable with NBK Season 4 this Diwali

Hyderabad, India (October 29, 2024) – Get ready for an Unstoppable Diwali celebration with the…

10 hours ago

Shruti Haasan ignites popular magazine MENS XP

Shruti Haasan, a name synonymous with versatility and innovation, continues to redefine the boundaries of…

11 hours ago

ప్రముఖ మ్యాగజైన్ ‘మెన్స్ ఎక్స్‌పీ’పై శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ మల్టీ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో శ్రుతి హాసన్…

11 hours ago

నార్త్ ఇండియాలో “గేమ్ ఛేంజర్” పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్న AA ఫిల్మ్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం ఈ…

11 hours ago

“Game Changer” North India distribution rights By AA Film

Global superstar Ram Charan's  Game Changer for long has been the most awaited project. Much…

11 hours ago

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నుంచి సెకండ్ సింగిల్ “నీతో ఇలా” విడుదల

యంగ్ అండ్ డైనమిక్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైవిధ్యభరితమైన…

11 hours ago