నాలోని కొత్త‌కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్రం ల‌వ్‌, మౌళి

Must Read

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 7న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేసింది. సంద‌ర్భంగా న‌వ‌దీప్ మాట్లాడుతూ అన్ని లాంగ్వేజ్‌లో ర‌క‌ర‌కాల కొత్త కంటెంట్‌తో సినిమాలు వ‌స్తున్నాయి. అదే కోవ‌లో తెలుగులో రాబోతున్న వైవిధ్య‌మ‌న‌, విభిన్న‌మైన సినిమా ఇది. ప్రేక్ష‌కుల‌ను
థియేట‌ర్‌కు ర‌ప్పించే సినిమా ఇది. ఆడియన్స్‌కు థియేట‌ర్‌కు ఎందుకు రావాలో అన్న ప్ర‌శ్న‌కు ఈ చిత్రంలో స‌మాధానం దొరుకుతుంది. చిరపుంజి, మేఘాల‌యాలోని అంద‌ర‌మైన ప్ర‌దేశాల్లో
షూట్ చేసిన చిత్ర‌మిది. ఈ క‌థ విన్న‌ప్పుడు అక్క‌డే చేయాల‌ని అనిపించింది. ఎన్నో వ్య‌య ప్ర‌య‌సాల‌తో చిత్రీక‌ర‌ణ చేశాం. ఈసినిమా ప్రొడ‌క్ష‌న్ ఎలా జ‌రిగింది అనే దాని మీద ఓ సినిమా తీయ్యెచ్చు. మంచి బ్యూటిఫుల్ సినిమా తీశామ‌నే న‌మ్మ‌కం క‌లిగింది. ఇక సినిమా ఫ‌లితం ఆడియ‌న్స్ చేతిలో వుంది క‌థ విన‌గానే న‌చ్చిన సినిమా ఇది. నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో నా ప్రేమ‌క‌థ‌లు, నా ల‌వ్‌స్టోరీల్లో వున్న పాయింట్‌ను ట‌చ్ చేశాం. ఈ క‌థ, ఈ పాయింట్ క‌నెక్్ట అయితే వాళ్ల ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వ‌స్తాయో చూడాల‌ని వుంది. ఈ 20 ఏళ్ల కెరీర్ త‌రువాత నాలో వున్న కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తూ చేసిన సినిమా ఇది.

ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర మాట్లాడుతూ ఇందులో నేటి యువ‌త‌రానికి కావాల్సిన అంశాలున్నాయి. ఈ చిత్రంలో అంద‌రికి రిలేట్ అయ్యే అంశాలు, క‌నెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేమ‌లో వున్న వారి రిలేష‌న్స్ ఎలా వున్నాయి. నేటి యువ‌త‌రం ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రేక‌ప్‌లు అవుతున్నాయి. కాంప్ర‌మైజ్ అయితే త‌ప్ప రిలేష‌న్స్ నిల‌బ‌డ‌వా? అనే ప్ర‌శ్న‌కు నాకు దొరికిన ప‌రిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపెడుతున్నాం. ఈ సినిమా డీఐ కేర‌ళ‌లో జ‌రుగుతున్న‌ప్పుడు మంజుమ్మ‌ల్ బాయ్‌, ఆవేశానికి ప‌నిచేసిన క‌ల‌రిస్ట్ మా సినిమాకు ప‌నిచేస్తున్న‌ప్పుడు సినిమా చూసి ఎంతో అభినందించాడు. ఆయ‌న అందించిన ప్ర‌శంస‌లు మ‌రువ‌లేనిది. రేపు చిత్ర విడుద‌లైన త‌రువాత కూడా అంద‌రికి న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమా కోసం న‌వ‌దీప్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆయ‌న అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంద‌నే నమ్మ‌కం వుంది అన్నారు.

నటీనటులు: నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు
బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం .. సి స్పేస్
ర‌చ‌న -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర
సంగీత దర్శకులు: గోవింద్ వసంత
పాట‌ల రచన.. అనంత శ్రీరామ్
ఆర్ట్.. కిరణ్ మామిడి
పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News