రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్‌.. ‘లీగల్లీ వీర్’ హీరో వీర్ రెడ్డి

సిల్వర్ కాస్ట్ బ్యానర్ మీద స్వర్గీయ ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో ‘లీగల్లీ వీర్’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. రవి గోగుల దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో..

హీరో, వీర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.  కరోనా టైంలో పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్న, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్ థ్రిల్లర్ సినిమాలు అంతగా రాలేదు. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్న. డబ్బింగ్‌లో ప్రాబ్లం వచ్చింది కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.  

డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘వీర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్ చూశాకా నాకు మాటలు రావడం లేదు. మా సినిమాకి మీడియా ప్రోత్సహించి, ఆదరించాలి’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ మాట్లాడుతూ..  ‘నిర్మాత వీర్ సార్ చాలా కూల్‌గా ఉంటారు.. ఇందులో నేను ఒక పాటకు కొరియోగ్రఫీ చేశాను. అది అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

నటుడు గిరిధర్ మాట్లాడుతూ.. ‘కొత్త టీం అయినా కూడా సినిమా ని చాలా బాగా అద్భుతంగా చిత్రీకరించారు. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది కానీ ఇలాంటి టీం ఇంత వరకు చూడలేదు’ అని అన్నారు.

నటీనటులు : వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్, జబర్దస్త్ అప్పారావు, జయశ్రీ రాచకొండ, కల్పలత, లీలా శాంసన్, మిర్చి హేమంత్, ప్రీతి సింగ్, వీర శంకర్, వినోద్

సాంకేతిక బృందం
బ్యానర్ : సిల్వర్‌కాస్ట్
సమర్పకులు : స్వర్గీయ ఎం.వీరనారాయణ రెడ్డి
నిర్మాత: శాంతమ్మ మలికిరెడ్డి
దర్శకుడు: రవి గోగుల
డి ఓ పి : జాక్సన్ జాన్సన్, అనుష్
సంగీతం : శంకర్ తమిరి
ఎడిటర్: ఎస్ బి  ఉద్ధవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చైతన్య రెడ్డి
సాహిత్యం: శ్యామ్ కాసర్ల, భరద్వాజ్ గాలి, రోల్ రైడా
కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ మాస్టర్, వల్లం కళాధర్
యాక్షన్: రామకృష్ణ
పి ఆర్ ఓ : పాల్ పవన్–

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago