ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి

Must Read

ఎన్నికలు సజావుగా జరిగేలా కేంద్ర బలగాలను మోహరించాలి:

ఎన్నికల కమీషన్ కు లెటర్ రాసిన నట్టికుమార్.

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు క్షీణించాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలను దించేలా తగిన చర్యలు చేపట్టాలని
ఎన్నికల కమీషన్ కు రాసిన లేఖలో సీనియర్ నిర్మాత, దర్శకుడు, విశాఖపట్నం మాజీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎన్నికల కమీషన్ కు తాను రాసిన లెటర్ గురించి ఆయన వివరిస్తూ… .

“ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఓ ఆగంతకుడు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐదు కోట్ల మంది ప్రజలు ఈ దాడిని చూసి నిర్గాంతపోయారు. సాధారణంగా సీఎంను కలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా ఒకటికి ఐదు ఇంతల సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ప్రజలలోకి వచ్చి, ఎక్కడ సభలు పెట్టినా, దాదాపు అర కిలోమీటర్ వరకు పూర్తి బందోబస్తు ఉంటుంది. సీఎం సభలకు దగ్గరలో ఉండే ఇళ్ళు, స్కూల్స్, ఇతర వ్యాపార కార్యాలయాలు వేటినైనా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడపడతారు.
.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పరిపాటి. అయితే 50 ఫీట్స్ దూరం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగింది అని అంటున్నారు. నిజంగా రాయి అయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు. రాయి కాకుండా రబ్బర్ షూటర్ కావచ్చు అని కూడా వినిపిస్తోంది. 50 ఫీట్స్ నుంచి దాడి జరిగితే సెక్యూరిటీ ఎందుకు పసిగట్ట లేకపోయారు. సభకు దగ్గరలో ఉన్న స్కూల్ పై నుంచి ఆ ఆగంతకుడు దాడి జరిపిన తర్వాత మేడపై నుంచి కిందకు దిగేలోపు ఎందుకు అతడిని పట్టుకోలేదు. అసలు ఆ స్కూల్ ను ముందుగా తమ అధీనంలోకి సెక్యూరిటీ ఎందుకు తీసుకోలేదు. ఆ ఏరియాలో ఒక ముఖ్యమంత్రి సభ జరుపుతుంటే కరెంటు ఎందుకు పోయిందన్న కారణం గురించి సంబంధిత అధికారులు అయిన ADE, AE లను విచారించారా?. వారు ఎవరెవరితో ఆ సమయంలో ఫోన్స్ లో మాట్లాడారో అనే విషయంపై ఎంక్వయిరీ జరిపారా?. అలాగే అక్కడి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఏం జరిగిందన్న అంశంపై ప్రశ్నించారా? సీఎం సభ పెట్టిన ప్రదేశంలోనే డీసీపీ, పోలీస్ కమీషనర్ స్థాయి అధికారులు ఉన్నారు.. రాయి కానీ మరేదైనా రబ్బర్ అయినా తగులుతుడు సీఎం వెనుక ఉన్న సెక్యూరిటీ ఎందుకు కాపాడలేకపోయారు. వాళ్ళు ప్రత్యేక కళ్ళ అద్దాలతో దూరం నుంచి ఏం రాబోతోందో ముందే పసిగట్టగలుగుతారు. సీఎంకు తగిలినది రాయినో ఇంకేదో తెలుసుకోలేక, దానిని కనిపెట్టడానికి బహుమతి ఇస్తామంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఇలా జరిగితే సామాన్య ప్రజలకు రక్షణ ఏది? దాదాపు 1400 మంది పోలీస్ బందోబస్తు ఎం చేస్తున్నట్లు?.

ఇంకా ఇదే సమావేశంలో నట్టి కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు. “కోడికత్తి కేసు ఇంతవరకు తెలింది లేదు. దాడి వెనుక కారణాలు ఏంటో బయటకు రాలేదు.. అలాగే వై.ఎస్. వివేకా గారి హత్య వెనుక కారణాలు బయటకు రాలేదు. వివేకా మర్డర్ గురించి జగన్ కు తెలుసు..వైఎస్.సునీత, వై.ఎస్ షర్మీల ప్రశ్నలకు జగన్ దగ్గర సమాధానాలు లేవు. విమలమ్మ‌ వన్ సైడెడ్ గా‌ మాట్లాడారు ..ఇదంతా జరుగుతుండగానే జగన్ కు రాయి తగిలింది. ఆ రాయి దెబ్బ వెల్లంపల్లికి కూడా తగిలిందని ఓ కన్ను మూసేశారు.

సినీ పరిశ్రమ స్పందించడం లేదు

ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్మాత నవీన్ ఎర్నేని‌ పేరు ఓ కేసులో వినిపించింది..ఆయనపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఛాంబర్ స్పందించలేదు..నవీన్ వందలకోట్ల తో సినిమాలు చేస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలల్లో నిజం ఎంతో తేలాలి. ..ప్రతిసారి ఇండస్ట్రీ పేరు ఎందుకు వస్తుంది.‌ మరలా క్లీన్ చీట్ ఎందుకు ఇస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణలలో కూడా ఇండస్ట్రీ పరువు తీసిన పోలీసుల పై ఎందుకు యాక్షన్ తీసుకుకోలేదు. సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తుంటే , సినీ పెద్దలు ఖండించటం లేదు ..తప్పుడు అభియోగాలను ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకొవాలి..డ్రగ్స్ ను ఎవరు సహించేది లేదు..నిందితులకు శిక్ష పడాల్సిందే. సినిమా వారిపై దయచేసి అభాండాలు వేయటం కరెక్ట్ కాదు. చేస్తే సరైన విచారణ జరపాలి” అంటూ ముగించారు.

Latest News

Sanjay Leela Bhansali’s Love And War has fixed 20 March 2026

AR The announcement of Sanjay Leela Bhansali's next epic saga titled LOVE AND WAR, starring Ranbir Kapoor, Alia Bhatt,...

More News