చివరి దశలో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌ ‘పురుష:’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

సరస్వతి బత్తుల సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ పాత్రలు హైలెట్ కానున్నాయని సమాచారం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన కంటెంట్ ట్రేడ్ వర్గాల్లో హైప్‌ను క్రియేట్ చేసింది. పాటలు అయితే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. సమ్మర్ కానుకగా ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు.

ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ‘పురుష:’ రూపొందుతోంది. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సతీష్ ముత్యాల కెమెరామెన్‌గా, కోటి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు : పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
బ్యానర్: కళ్యాణ్ ప్రొడక్షన్స్
సమర్పణ : సరస్వతి బత్తుల
నిర్మాత: బత్తుల కోటేశ్వరరావు
దర్శకుడు: వీరు వులవల
సంగీత దర్శకుడు: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
ఎడిటర్: కోటి
ఆర్ట్ డైరెక్టర్: రవిబాబు దొండపాటి
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
పీఆర్వో: సాయి సతీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

5 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

5 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

5 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago