“గేదెల రాజు” నాకు సమ్ థింగ్ స్పెషల్ మూవీ – యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని dమోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె

  • నేను యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా గతంలోనూ కొన్ని చిత్రాలకు పనిచేశాను. కానీ “గేదెల రాజు” సినిమా నాకు సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది. సినిమా ఆద్యంతం సాగే క్యారెక్టర్ లో నటించాను కాబట్టి సినిమా మీద కమాండే ఏర్పడింది. అది మ్యూజిక్ చేసేప్పుడు చాలా ఉపయోగపడింది. మా మూవీలో బీజీఎం చాలా న్యాచురల్ గా కుదిరింది. ఈ మధ్య సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్ ను డామినేట్ చేస్తోంది. అప్పట్లో శివ, గీతాంజలి లాంటి మూవీస్ మనం గమనిస్తే పెరుగు మీద మీగడలా క్యారెక్టర్ ను బీజీఎం మరింత అందంగా చేసేది. ఇప్పుడు బీజీఎం అంటే శబ్దంలా మారిపోయింది. మా మూవీలో నేను ఆ జాగ్రత్త తీసుకున్నాను. క్యారెక్టర్ ను ఎక్కడా బీజీఎం డామినేట్ చేయకుండా, సెటిల్డ్ గా కంపోజ్ చేశాను. పాటలు కూడా కథను ముందుకు నడిపించేలా సిచ్యువేషనల్ గా ఉంటాయి. మూడు సాంగ్స్ లో ఒకటి నేను, మరొక పాట బేబక్క, ఇంకోటి మంగాదేవి పాడారు. బీజీఎం కు 45 రోజుల టైమ్ ఇచ్చారు. కేజీఎఫ్, కల్కి వంటి మూవీస్ కు సౌండ్ డిజైన్ చేసిన రాజారత్నం గారి దగ్గర పనిచేసిన హరీష్ మా మూవికి సౌండ్ డిజైన్ చేశారు. డాల్బీలో చూస్తే మా మూవీ సౌండింగ్ బాగా ఆకట్టుకుంటుంది.
  • ఈ సినిమాలో నా క్యారెక్టర్ భయపెట్టేలా ఉండాలి, అలా కనిపించేందుకు 12 కేజీల బరువు పెరిగాను. మైత్రీ శశిగారు సినిమా చూసి మీరు అప్పట్లో చేసిన టెలివిజన్ కార్యక్రమాలు చూసి సాఫ్ట్ గా ఉంటారనుకున్నా, ఈ క్యారెక్టర్ లో భయపెట్టారు అన్నారు. సినిమా చూసిన వాళ్లంతా నా క్యారెక్టర్ మాస్ అప్పీల్ తో బాగుందని చెప్పారు. ఈ నెల 17న మూవీ రిలీజ్ అనుకున్నాం. అయితే అప్పటికి థియేటర్స్ కన్ఫర్మ్ కాలేదు. ఆ టైమ్ లో మధుర శ్రీధర్ రెడ్డి గారు నెక్ట్స్ వీక్ కు వెళ్లొచ్చు కదా అన్నారు. మేమూ ఆలోచనలో పడ్డాం. ఆ తర్వాత అన్నీ ఒక్కొక్కటిగా సెట్ అవుతూ వచ్చాయి. నైజాంలో మైత్రీ వాళ్లు 100కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో కలిపి 200 స్క్రీన్స్, అలాగే ఓవర్సీస్ లో 60 లొకేషన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతోంది. ఇలాంటి చిన్న సినిమాకు ఇది హ్యూజ్ రిలీజ్ అనే చెప్పుకోవచ్చు.
  • ఈ సినిమాలో మ్యాటర్ ఉంది, కానీ వీళ్ల దగ్గర మూటలు లేవు. డైరెక్టర్ చైతన్య సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతి డిపార్ట్ మెంట్ దగ్గరుండి చూసుకునేవాడు. ఏడాది పాటు తిప్పలు పడుతున్నారు. సినిమా పట్ల వీళ్లకున్న ప్యాషన్ చూసి ప్రొడక్షన్ లో నేనూ భాగమయ్యా. సహజంగా నేను నా ప్రతి సినిమాకు వందశాతం ఎఫర్ట్స్ పెడుతుంటా. ఈ సినిమాకు ఇంకాస్త నా అవసరం ఉందనిపించింది. అందుకే ప్రెజెంటర్ గా మారాను.
  • ఈ సినిమాలో నా పాత్ర గోదావరి జిల్లా యాసలో మాట్లాడాలి. నేను గోదావరి జిల్లా వాడిని కాబట్టి ఈ క్యారెక్టర్ లో నటించడం సులువైంది. బరువు పెరిగి, పొట్టతో రెడీ అయిన నాకు ఆ పాత్ర ఆవహించేసింది. నేను గతంలో ఒక మూవీలో తెలంగాణ యాసలో ఉండే పాత్ర పోషించాను. ఆ యాస నాకు అలవాటు లేదు కాబట్టి ఇబ్బందిపడ్డాను. ఈ సినిమా రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. ఫిష్ మార్కెట్ లో చేసిన సీన్స్ లో అక్కడి వాళ్లంతా వాళ్ల వాళ్ల పనులు చేసుకుంటూ సహజంగా మా మూవీలో కనిపించారు. ఇంటర్వెల్ ఫైట్ ఆకర్షణగా నిలుస్తుంది. ఆ ఫైట్ లో డూప్ కత్తులు దొరక్క నిజం కత్తులు వాడారు. అవి ఎక్కడ గాయపరుస్తాయో అని భయమేసింది. ఒక సీన్ లో భాగంగా ఫిష్ మార్కెట్ లో రాత్రంతా ఉండాల్సివచ్చింది. నటుడిగా హ్యాపీగా ఉండే సినిమాలే కాదు ఇలా కష్టపడే సందర్భాలూ వస్తాయి అనిపించింది.
  • గెదెలరాజు క్యారెక్టర్ ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం చూస్తుంటే నాకే వాడిని చంపాలనిపించేంత కోపం వచ్చింది. రేపు మీరు సినిమా చూశాక ఏమంటారో అనిపిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఆర్టిస్టుగా, మ్యూజిక్ డైరెక్టర్ గా బాగా పర్ ఫార్మ్ చేశావని ప్రశంసిస్తున్నారు. అయితే ఆర్టిస్టుగానే కాస్త ఎక్కువ క్రెడిట్ తీసుకుంటాను. మూవీస్ రెగ్యులర్ గా చూసే ఆడియెన్స్ కొన్ని సినిమాల ఫేట్ మారుస్తుంటారు. ఈ మూవీ లవర్స్ కు మా సినిమా తప్పకుండా నచ్చుతుందని నమ్మకం ఉంది.
  • విలన్ గానే నటించాలని లేదు. ఆఫర్స్ రావడాన్ని బట్టి ముందుకు వెళ్తుంటా. పయనం, అఖండ 2 రైటర్ కల్యాణ చక్రవర్తి రూపొందిస్తున్న సినిమా ఒకటి చేస్తున్నా. అల్లరి నరేష్ గారి సినిమాలోనూ ఒక మంచి రోల్ చేస్తున్నా.

TFJA

Recent Posts

నేడు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో పావలా శ్యామల అంత్యక్రియలు

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుండి…

21 hours ago

*వెర్స‌టైల్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ రిలీజ్

వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర యూనిట్ ఈరోజు (మంగళవారం) ఫస్ట్ సింగిల్…

21 hours ago

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’తో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.…

21 hours ago

ప్రముఖ నటి పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న ‘మా’ అసోసియేషన్ మరియు కరాటే కళ్యాణి

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె…

2 days ago

ఎలైట్ క్రికెట్ లీగ్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగే ‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం.. ఆగస్ట్ 7న భారీ ఎత్తున చిత్రం విడుదల

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల…

3 days ago

హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘సిత్తరాల నవ్వు’ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

3 days ago