మేమ్ ఫేమస్’ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది:

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ ,చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. ఇటివలే ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం  వహిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన  మేమ్ ఫేమస్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఒక గ్రామంలోని ముగ్గురు నిర్లక్ష్యపు స్నేహితులు తమ తల్లిదండ్రులు తిడుతున్నప్పటికీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తుంటారు. ఆ ముగ్గురూ ఫేమస్  పదాన్ని తరుచుగా వాడుతుంటారు. వారు ఫేమస్ కాదు ఫేమస్ చేయమని చెబుతుంటారు. టార్న్  జీన్స్ ఎపిసోడ్, 13వ రోజు వేడుక , ఒక ఫంక్షన్‌లో ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడం టీజర్‌లోని వినోదాత్మకంగా వున్నాయి. మేమ్ ఫేమస్ నాన్ స్టాప్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని వీడియో భరోసా ఇస్తుంది 

సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి ముగ్గురు స్నేహితులుగా నవ్వులు పూయించారు. సినిమాకి దర్శకత్వం వహించిన సుమంత్ ప్రభాస్ వినోదానికి తగినంత స్కోప్ ఉన్న సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, కళ్యాణ్ నాయక్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఫన్ ని ఎలివేట్ చేశాడు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంత్రిమల్లా రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ ప్రభాస్ చాలా స్మార్ట్ వున్నాడు. తను తెలంగాణ ప్రభాస్. మంచి కంటెన్ వున్న సినిమాలు ఇవ్వడంలో ఛాయ్ బిస్కట్ చాలా ఫేమస్. నిర్మాతలు అనురాగ్ శరత్ చాలా మంచి అభిరుచి వున్న నిర్మాతలు. ఫేమస్ కావాలంటే కష్టపడాలి. యువత కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలి. పాలు అమ్ముకునే నేను ఈ రోజు మంత్రినయ్యా. లక్షలాది విద్యార్ధులని తీర్చిదిద్దుతున్న. కష్టపడితే ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతాం. ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా వుంది. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు 

సుహాస్ మాట్లాడుతూ.. మేమ్ ఫేమస్ ట్రైలర్ చూశాను. అదిరిపోయింది. సినిమా అదిరిపోతుంది. చాలా జెన్యున్ గా తీసిన సినిమా ఇది. అందరూ జూన్ 2న థియేటర్ కి వచ్చి మా టీం అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.

సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. కాలేజీలో వున్నపుడు సరదాగా పిల్ల పిల్లగా అనే వెబ్ సిరిస్ చేశాం. అప్పుడు మాకు 19 ఏళ్ళు. అప్పుడు సినిమాలకి రావాలనే ఆలోచనే లేదు. డిగ్రీ పరీక్షల తర్వాత ఎస్సై టెస్ట్ కి ప్రిపేర్ అవుదామని అనుకున్న సమయంలో అనురాగ్ అన్న నుంచి కాల్ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చింది.  మా దగ్గర ఎనర్జీ వుండేది. కానీ డైరెక్షన్ మాత్రం చాయ్ బిస్కెట్ వలనే వచ్చింది. మేము చూసిన సినిమా షూటింగ్ కూడా మా సినిమా షూటింగ్ నే.  మేము సినిమా చేయగలమనే నమ్మకాన్ని ఇచ్చింది అనురాగ్ , శరత్ అన్న. వారికి జీవితాంతం రుణపడి వుంటాను.  టీజర్ మీ అందరికి నచ్చడం ఆనందంగా వుంది. జూన్ 2న మంచిగా కుదిరిన మటన్ లాంటి రుచికరమైన సినిమా చూపిస్తాం’’ అన్నారు 

అనురాగ్ మాట్లాడుతూ.. రైటర్ పద్మ భూషణ్ ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీ ఆదరణ గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి నమకాన్ని ఇచ్చింది. అథితి దేవో భవ అనే మాట వుంది. రైటర్ పద్మభూషణ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రేక్షక దేవో భవ అని ఫిక్స్ అయిపోయాను.  మేమ్ ఫేమస్ సినిమాకి కూడా ఇలానే ఆదరిస్తానే నమ్మకం వుంది.  సుమంత్ ప్రభాస్ పాజిటివ్  పర్శన్.  సుమంత్ ప్రభాస్ లాంటి తమ్ముడు వుండాలని అందరూ కోరుకుంటారు. ఈ సినిమాని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను.

శరత్ మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మల్లా రెడ్డిగారికి కృతజ్ఞతలు. కంటెంట్, యువ ప్రతిభని ప్రోత్సహించాలని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. కొత్త దర్శకుడితో తీసిన రైటర్ పద్మ భూషణ్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మేమ్ ఫేమస్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్ లో మజా వస్తుంది.

చంద్రు మనోహర్ మాట్లాడుతూ.. అనురాగ్ శరత్ త కలసి పని చేయడం అనందంగా వుంది. ఇదీ బ్లాక్ బస్టర్ కొడతాం’’ అన్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంత పాల్గొంది.

ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

ఈ చిత్రాన్ని జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు.

 తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్

బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

సంగీతం: కళ్యాణ్ నాయక్

డీవోపీ: శ్యామ్ దూపాటి

ఎడిటర్: సృజన అడుసుమిల్లి

ఆర్ట్ : అరవింద్ మూలి

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్ : సూర్య చౌదరి

పీఆర్వో: వంశీ-శేఖర్

క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: ఉదయ్-మనోజ్

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

7 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

8 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

8 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

8 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

8 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

13 hours ago