కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను స్వాగతించిన మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ టీం
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ మేకర్స్ ఒక్కో అనౌన్స్ మెంట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్నీ క్రాఫ్ట్స్ లో చాలా కేర్ తీసుకుంటున్నారు. విశ్వంభర టీమ్ ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను ఈ మ్యాజిస్టిక్ వరల్డ్ కి స్వాగతించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యారు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కునాల్ కు ఇది గొప్ప అవకాశం.
విశ్వంభరలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…