కుబేర ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది -దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

Must Read

కుబేర ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. జూన్ 20. డోంట్ మిస్ కుబేర: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

-కుబేర కంప్లీట్ గా శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేమంతా కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి చేశాం. ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుంది: కింగ్ నాగర్జున

-కుబేర చాలా డిఫరెంట్ ఫిల్మ్. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది: సూపర్ స్టార్ ధనుష్

  • కుబేర ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఇప్పటివరకూ ఇలాంటి సినిమాని చూసి వుండరు. అంత ఫ్రెష్ గా ఉంటుంది. డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది: డైరెక్టర్ శేఖర్ కమ్ముల

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి ‘కుబేర’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్ గా హంబుల్ గా ఉంటారు. ఆయనను చూసిన వెంటనే మనకి అలానే అనిపిస్తుంది. కానీ ఆయన చాలా దృఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను. శేఖర్ ఆయన నమ్మిన సిద్ధాంతాల మీద సినిమాలు తీస్తారు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలు కి సంబంధం ఉండదు. మేము కంప్లీట్ అపోజిట్ పోల్స్. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాల అయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన నాకు జూనియర్ అనుకున్నాను కానీ నాకంటే వన్ ఇయర్ సీనియర్ తను. ఈ 25 సంవత్సరాల్లో అలాగే ఉన్నాడు. తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు తీశాడు. ఆయన అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నాగార్జున గారు, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్ గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగర్జున గారు, పూర్ ప్రపంచంలో ధనుష్ గారు.. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్ ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల గారు తన సినిమాని ట్రైలర్ లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జున గారిని ధనుష్ గారిని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతిది టాప్ క్లాస్ లో వున్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. జూన్ 20. డోంట్ మిస్ కుబేర’అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ థాంక్యూ. ధనుష్ టప్ కలసి వర్క్ చేయడం ఒక హానర్ గా భావిస్తున్నాను. తను ఒక క్యారెక్టర్ లో పెర్ఫార్మ్ చేసే విధానం అవుట్ స్టాండింగ్. తనకి మరిన్ని విజయాలు రావాలి.తనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కుబేర గురించి మాట్లాడాలంటే నాకు శేఖర్ కమ్ముల గారు గుర్తుకొస్తారు. ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే. ఆయన కంఫర్ట్ జానే నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. మాయాబజార్ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. లాగే కుబేర కూడా శేఖర్ కమ్ముల ఫిలిం. శేఖర్ కమ్ముల కోసమే ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా హిట్ అవుతుందని శేఖర్ కాన్ఫిడెంట్ గా చెప్తుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది. శేఖర్ పై పూర్తి నమ్మకం. ఉంది దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు వింటుంటే పూనకం వస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాతలు సునీల్ గారు రామ్ మోహన్ గారికి థాంక్ యూ. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది. ఎలాంటి పాత్రలు చేసిన మీరు ఒప్పుకుంటున్నారు. చూస్తున్నారు. అభినందిస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఐ లవ్ యూ టు ఆల్’అన్నారు.

హీరో ధనుష్ మాట్లాడుతూ.. ఓం నమశ్శివాయ.అందరికీ నమస్కారం. ఏవీ చూస్తున్నప్పుడు మా నాన్నగారి గుర్తుకొచ్చారు. మమ్మల్ని ప్రయోజకులను చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఈరోజు ఇక్కడ ఇక్కడ వుండటానికి కారణం ఆయన కష్టం. ఈ సందర్భంగా నాన్నకి కృతజ్ఞతలు. శేఖర్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. హెల్త్ ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డారు. ఆయన విషయంలో నేను చాలా కంగారు పడ్డాను. ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. శేఖర్ గారు సార్ సినిమాకి ముందే ఈ కథ నాకు చెప్పారు. నా రెండో సినిమా ఆయనతో చేయడం చాలా ఆనందం. కుబేరలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్ గారికి ధన్యవాదాలు. నాగార్జున గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూస్తూ పెర్గిగాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. రష్మిక హార్డ్ వర్క్ చేసింది. తన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. సునీల్ గారికి రామ్మోహన్ గారికి థాంక్ యూ. వారు లేకపోతే ఈ సినిమా లేదు. నా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. జూన్ 20 వస్తుంది. తప్పకుండా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది’అన్నారు.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా 25 ఇయర్స్.. మీరు రావాలని పిలవగానే వచ్చిన రాజమౌళి గారికి థాంక్యూ. ఏదైనా చేయగలం అనే నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారు. మీడియాకి ధన్యవాదాలు. ప్రతి సినిమా కూతురు లాంటిది కొడుకు లాంటిదని చెప్తుంటాను. కుబేర మాత్రం తల్లి ప్రేమ లాంటిది. బిచ్చగాడు అయినా కోటీశ్వరుడైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియాలజీతో కథ రావడం అదృష్టంగా భావిస్తున్న. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సరస్వతి దేవి తలెత్తుకుని చూస్తుంది. ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా. అంత ఫ్రెష్ గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆడియన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది. ట్రూ పాన్ ఇండియన్ మూవీ. ఇందులో నవ్వు ఎమోషన్ ఏడుపు థ్రిల్ ఆశ్చర్యం బాధ అన్ని కలగలిపి ఉంటాయి. కుబేర ఫెంటాస్టిక్ ఫిలిం. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాగార్జున గారితో షూట్ చేస్తున్నప్పుడు నెర్వస్ ఫీల్ అయ్యాను. శివ షూటింగ్ టైం లోనాగార్జున గారిని చూశాను. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. నేను ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే రెడీ అన్నారు. అందుకు నాగార్జున గారికి ధన్యవాదాలు. నాకోసం ఏదైనా చేస్తానని చెప్పి ఈ సినిమాని చేశారు. రశ్మిక తను చాలా బ్యూటిఫుల్ పర్సన్. లోపల బయట ఒకేలా ఉండే అమ్మాయి. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. జిమ్ షర్బ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫాం చేశాడు. ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రైడ్ ఆఫ్ ఇండియా. బిచ్చగాడిలా కనిపించాలంటే నిజంగా అలానే కనిపించి చూపించాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ తనని బడమని చెప్పారని, నిజంగానే సన్నబడి చూపించాడు. తనకి ఎన్ని నేషనల్ అవార్డ్స్ వచ్చిన తక్కువే. తోట తరిణి గారు నాకు ఫాదర్ లాంటి వ్యక్తి. ఈ సినిమాకి అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. దేవిశ్రీ సినిమాకి ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. అది మ్యూజిక్ లో కనిపిస్తుంది. సునీల్ గారు రామ్మోహన్ గారు ఇంత బిగ్ స్కేల్ సినిమాని ఎక్కడ జంకకుండా నిర్మించారు. ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కుబేర డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరు పేరునా థాంక్యూ. కుబేర ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది’అన్నారు.

హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ..అందరికి నమస్కారం. కుబేర నాకు గొప్ప ఆపర్చునిటీ. నాకు శేఖర్ గారితో వర్క్ చేయాలని వుండే. ఆ అవకాశం ఈ సినిమాతో దొరికింది. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. టీమందరికీ థాంక్యూ. నాగార్జున గారితో రెండోసారి కలిసి పని చేసే అవకాశం దొరికింది. ఆయన వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ధనుష్ గారితో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మా కెమిస్ట్రీ చూసి మరి కొంత మంది దర్శకులు రచయితలు కొత్త సినిమాలు ఆఫర్ చేస్తారని నమ్ముతున్నాను. ఆయనతో మరోసారి కలిసి పని చేయాలని ఎదురుచూ స్తున్నాను. నిర్మాతలు చాలా బడ్జెట్ పెట్టి అద్భుతంగా ఈ సినిమాని తీశారు. ఈ సిమమా గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’అన్నారు.

దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా జర్నీలో నన్ను ఎంతోగా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. కుబేర చాలా స్పెషల్ ఫిలిం. దీని గురించి ఎంత మాట్లాడిన తక్కువే అనిపిస్తుంది. శేఖర్ గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలి. ఫైనల్ గా కుబేరతో అది కుదరడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇలాంటి కథని ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి వుండము. చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు. నేషనల్ క్రష్ రష్మిక గారు చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. సినిమా అంతా ఉంటారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ధనుష్ గారు అద్భుతంగా చేశారు. ఇది వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్. ఆయన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు సర్ప్రైజ్ అనిపించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు ఒక క్యారెక్టర్ గానే కనిపించారు. నాగార్జున గారితో నాది విడదీయలేని బంధం. ఇందులో ఆ క్యారెక్టర్ నాగర్జున గారు చేయకంటే ఇంక ఎవరితో చేసేవారో ఊహకు అందటం లేదు. అంత రాయల్ గా కనిపించారు. ఈ సినిమా స్టార్ కాస్ట్ అమేజింగ్. ఈ సినిమాల్లో పార్ట్ కావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. జూన్ 20న తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. నిర్మాతలు సునీల్ గారు జాన్వి గారి సపోర్ట్ కి థాంక్యూ. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు

నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శేఖర్ కమ్ముల గారు ఒక డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసే అద్భుతమైన ఫిలిం మేకర్. ఈ సినిమాని అంతే డిఫరెంట్ గా వేరే జానర్ లో తీశారు. థ్రిల్లర్ క్రైమ్ సస్పెన్షన్ అన్ని ఎలిమెంట్స్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూడబోతున్నారు. శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ధనుష్ గారు ఫెంటాస్టిక్ గా పెర్ఫాం చేశారు. ఆయన ఆల్ రౌండర్. నాగార్జున గారు మాకు ఎంతో స్పెషల్. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మా సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాల్లో ఆయన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 300 కోట్ల హీరోయిన్ రష్మిక మా సినిమాలో వున్నారు(నవ్వుతూ) దేవిశ్రీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్షన్, ప్రొడక్షన్ టీం కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు

లిరిక్ రైటర్ నందకిషోర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. శేఖర్ గారి సినిమాకి పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవిశ్రీప్రసాద్ గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరూ చూడండి’అన్నారు.

లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల మాట్లాడుతూ.. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల గారితో ఇది రెండో అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను. శేఖర్ గారు, దేవి శ్రీ ప్రసాద్ గారి స్టైల్ ని క్లబ్ చేయడానికి చాలా టైం పట్టింది. అయితే రిజల్ట్ అద్భుతంగా వచ్చింది. నాగార్జున గారికి ధనుష్ గారికి రష్మిక గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా వండర్ఫుల్ టీంతో కలిసి చేసిన సినిమా ఇది. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News