సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్-అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేర.
లీడ్ రోల్స్ తో సహా రష్మిక మందన్న పాత్రని పరిచయం చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. ధనుష్, నాగార్జున కనిపించిన ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా యూనిట్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ పోస్టర్ ధనుష్, నాగార్జున పోషించిన పాత్రల మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూపిస్తుంది. ధనుష్ పాత్ర మ్యాసీ హెయిర్, గుబురు గడ్డంతో కనిపించగా, నాగార్జున లుక్ మోడరన్ అవుట్ ఫిట్స్ లో స్టయిలీష్ అవతార్ లో కనిపించారు. ఈ పోస్టర్ సినిమా థీం కోర్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…