సినీ నిర్మాణ రంగంలో స‌రికొత్త సంచ‌ల‌నం..

Must Read

సినీ నిర్మాణ రంగంలో స‌రికొత్త సంచ‌ల‌నం.. చేతులు క‌లిపి కె.ఆర్‌.జి.స్టూడియోస్‌, టి.వి.ఎఫ్ మోష‌న్ పిక్చర్స్ 

* ద‌క్షిణాది భాష‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాల‌ను నిర్మించ‌టానికి సిద్ధ‌మైన అగ్ర నిర్మాణ సంస్థ‌లు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కె.ఆర్‌.జి స్టూడియోస్ 6వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ టి.వి.ఎఫ్.మోష‌న్ పిక్చ‌ర్స్‌తో చేతులు క‌లిపింది. ఈ రెండు భారీ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ద‌క్షిణాది భాష‌ల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. వీరిద్ద‌రూ భాగ‌స్వామ్యులుగా విలువ‌ల‌తో కూడిన వైవిధ్యమైన సినిమాల‌ను రూపొందించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. 

సినీ రంగంలో ఓ సరికొత్త మార్పును తీసుకు రావ‌టానికి కె.ఆర్‌.జి.స్టూడియోస్ సిద్ధ‌మైంది. అందులో భాగంగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌ను సిద్ధం చేసి వాటిన ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సినిమాగా రూపొందించి ప్రేక్ష‌కుల‌కు అందించ‌ట‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టం వ‌ల్ల  కొత్త ఆలోచ‌న‌లతో క‌థ‌లు, సినిమాలు రూపొందుతాయ‌న‌టంలో సందేహం లేదు. ఈ సంద‌ర్భంగా..

కె.ఆర్‌.జి.స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ మాట్లాడుతూ “ఆరేళ్ల క్రితం క‌న్న‌డతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లో వైవిధ్య‌మైన, అర్థ‌వంతమైన‌ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే ఉద్దేశంతో కె.ఆర్‌.జి.స్టూడియోస్‌ను ప్రారంభిచాం. అందుకోసం స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్, ప్ర‌క్కా ప్రణాళిక‌తో దాన్ని అమ‌లు చేయ‌టం, గ్రాండ్‌గా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌టంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాం. కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌ట‌మే మా ఆలోచ‌న‌. అందుకోసం టి.వి.ఎఫ్ వంటి మ‌రో అగ్ర నిర్మాణ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయ్యాం. మీడియా మ‌రియు ఎంట‌ర్‌టైన్మెంట్‌లో అనుభ‌వ‌జ్ఞుడైన విజ‌య్ సుబ్ర‌మ‌ణ్యం ఈ ప్ర‌యాణంలో భాగ‌మైనందుకు ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం“ అన్నారు. 

టి.వి.ఎఫ్ వ్య‌వ‌స్థాప‌కుడు అరుణ‌భ్‌కుమార్ మాట్లాడుతూ “సినీ రంగంలో  వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకుని రావ‌టమే స్ఫూర్తిగా మా ప్ర‌యాణాన్ని ప్రారంభించాం. ర‌త్న‌న్ ప్ర‌పంచ‌, గురుదేవ్ హోయ‌శాల వంటి చిత్రాల‌ను నిర్మించిన సంస్థ‌తో చేతులు క‌ల‌ప‌టంపై చాలా ఆనందంగా ఉంది. డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తాం“ అన్నారు.

టీవీఎఫ్ అధ్యక్షుడు విజయ్ కోషీ మాట్లాడుతూ.. ‘మేం నిరంతరం రియలిస్టిక్ సినిమాలు, సహజత్వంతో కూడిన కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం.  ప్రాంతీయ సరిహద్దులను చెరిపి పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అయిన కేఆర్‌జీతో ప్రస్తుతం మేం కలిసి పని చేసేందుకు సిద్దమయ్యాం. మా రెండు సంస్థలో క్రియేటివిటీ అనేది కామన్‌గా ఉంది. ఇకపై మా రెండు సంస్థలు కలిసి అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందిస్తామ’ని అన్నారు.

టీవీఎఫ్ గురించి..

టీవీఎఫ్‌ను అరునభ్ కుమార్ స్థాపించి దాదాపు దశాబ్దం కావొస్తుంది. టీవీఎఫ్ అప్పటి వరకు వచ్చిన సినిమాలను, కథలను చెప్పే విధానాన్ని మార్చేసింది. ప్రస్తుతం యువతరం అభిరుచికి తగ్గట్టుగా చిత్రాలు నిర్మిస్తూ వచ్చింది. మీడియా అవుట్ లెట్స్, ప్రొడక్షన్ కంపెనీలను ప్రారంభించింది. ఇండియాలో అత్యున్నతమైన వెబ్ కంటెంట్‌ను ఇవ్వడంతో టీవీఎఫ్ ముందుంటుంది.

కేఆర్‌జీ గురించి..

కార్తీక్ గౌడ, యోగి జీ రాజ్ సంయుక్తంగా ఈ సంస్థను ఆరేళ్ల క్రితం స్థాపించారు. కన్నడ ప్రేక్షకులకు అద్భుతమైన, గొప్ప కథలను అందించేందుకు ప్రారంభించారు. ఇది వరకు ఎన్నడూ చూడని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది. కన్నడలోని గొప్ప కథలను ప్రేక్షకులకు అందిస్తుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News