కన్నడ నుంచి ప్రస్తుతం రూటెడ్ కథలు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. భూతకోళ అంటూ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో కన్నడ నుంచి మరో చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సాపల్య నిర్మాతగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఆడియో లాంఛ్‌ను మంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించడం, కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్‌లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్ని షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్ వంటి వారు ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ‘కొరగజ్జ’ ఆడియో మార్కెట్లోకి వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఆడియో లాంఛ్‌లో
నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ .. ‘‘కొరగజ్జ’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. అందరినీ సర్ ప్రైజ్ చేసేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.
దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతూ .. ‘కన్నడ పరిశ్రమలో ముప్పై ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ చిత్రాలు వచ్చాయి. ‘నాగరహోలి’ అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 భాషల్లో విడుదలైంది. కన్నడలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అందులో ‘కాంతార’ కూడా ఒకటి. కన్నడ నుంచి వచ్చిన కల్పనా గారు మనకు రష్యాలో అంబాసిడర్‌గా ఉండేవారు. మాకు ఎక్కువగా గ్రామపీఠ అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు మా నుంచి ‘కొరగజ్జ’ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమా చూసి ఆదరించండి. ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.
నటి శృతి మాట్లాడుతూ .. ‘‘కొరగజ్జ’ లాంటి అద్భుతమైన చిత్రంతో నాకు పాత్ర దొరకడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కన్నడలో ప్రస్తుతం ఎన్నో గొప్ప చిత్రాలు వస్తున్నాయి. మన భారత సంస్కృతి, ఆచారాల్ని చాటే చిత్రాలెన్నో వస్తున్నాయి. ‘కాంతార’ తరువాత కన్నడ నుంచి ‘కొరగజ్జ’ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
నటి భవ్య మాట్లాడుతూ .. ‘‘కొరగజ్జ’ లాంటి ఓ గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
నటుడు సందీప్ సొపర్‌కర్ మాట్లాడుతూ .. ‘కన్నడలో ఇది నాకు మొదటి చిత్రం. సుధీర్ సర్, త్రివిక్రమ్ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. నేను ఇంత వరకు ఇలాంటి డ్యాన్స్‌ను ఏ సినిమాలో చేయలేదు. ‘కొరగజ్జ’లో నాకు అద్భుతమైన పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. ఇందులోని ప్రతీ పాత్ర, ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. సాహిత్యం, సంగీతం, కళ అనేవి లేకపోతే మానవ మనుగడ ఉండదు’ అని అన్నారు.
‘కొరగజ్జ’లోని పాటలన్నీ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌లు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సాంకేతిక బృందం
బ్యానర్ : త్రివిక్రమ సినిమాస్ & సక్సెస్ ఫిల్మ్స్
నిర్మాత: త్రివిక్రమ్ సాపల్య
దర్శకత్వం, కథా పరిశోధన, స్క్రీన్‌ప్లే- సాహిత్యం- సంభాషణ : సుధీర్ అత్తవర్
ఎడిటర్: జిత్ జోషి
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పిళ్ళై
గాయకులు : షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…