“సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు మంచి మెసేజ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – హీరో విక్రాంత్

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు యంగ్ హీరో విక్రాంత్. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో విక్రాంత్.

  • మా స్వస్థలం విజయవాడ. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉండేది. పెద్దవాళ్లు ఎవరైనా సినిమాకు వెళ్తుంటే వాళ్లతో పాటు వెళ్లేవాడిని. చదువుకుని సాఫ్ట్ వేర్ కెరీర్ లోకి వచ్చాను. యూఎస్ వెళ్లి జాబ్ చేశా. అమెరికాలో ఇక్కడి కంటే ఎక్కువ సినిమాలు చూసేవాడిని. కోవిడ్ టైమ్ లో ఇక ఇలాగే వెయిట్ చేస్తుంటే లైఫ్ చూస్తుండగానే గడిచిపోతుంది అనిపించింది. ఇండియాకు వచ్చాను. కోవిడ్ మూడు నెలలకు మించి ఉండదు అనుకుంటే రెండేళ్లు పట్టింది. ఫ్యామిలీ నుంచి ప్రెషర్ పెరిగింది. ఈ టెన్షన్ లో స్పార్క్ అనే ఒక మూవీ చేశాను. ఆ సినిమా నాకు చేదు అనుభవం మిగిల్చింది. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని థియేటర్ ద్వారా నటనను మెరుగుపర్చుకున్నా.
  • ఆ తర్వాత ఒకరోజు శ్రీధర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన సంతాన ప్రాప్తిరస్తు స్క్రిప్ట్ పంపించారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే హీరో కథ ఇది. మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చుతుందా అనే సందేహం ఉండేది. అయితే స్క్రిప్ట్ కంప్లీట్ గా చదివాక ఎక్కడా లైన్ క్రాస్ కాకుండా, అసభ్యత లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా కథ ఉంది. దాంతో ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం కలిగింది. పెద్ద హీరోలు ఇలాంటి మూవీస్ చేయరు. వారికి ఇమేజ్ అడ్డు వస్తుంది. నాలాంటి కొత్త వాళ్లే ఇలాంటి డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి. పైగా కోవిడ్ తర్వాత వరల్డ్ సినిమాకు మనమంతా అలవాటు అయ్యాం. కొత్త జానర్, కొత్త కథలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నాలాంటి కొత్త హీరోలు రెగ్యులర్ ఫార్మేట్ మూవీస్ చేస్తే ఎవరికీ నచ్చదు. డిఫరెంట్ మూవీస్ చేయాలి, అందరికీ రిలేట్ అయ్యేలా ఉండాలి అనుకున్నా. “సంతాన ప్రాప్తిరస్తు”లో కథ ఇన్ ఫెర్టిలిటీ అనే ఒక సెన్సిటివ్ ఇష్యూను తీసుకుని దానికి ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేశాం. సినిమా మూడొంతులు ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది, చివరలో మంచి ఎమోషన్ తో, మెసేజ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు.
  • దర్శకుడు సంజీవ్ గారు 2017 నుంచి సిద్ధం చేసుకున్న స్టోరీ ఇది. ఎక్కడా ఒక్క సీన్ కూడా కదల్చనంత పక్కాగా స్క్రిప్ట్ చేశారు. ఈ మూవీలో చైతన్య అనే సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ రోల్ చేశాను. ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. ఈ పాత్ర కోసం ఆరు కిలోల బరువు పెరిగాను. టిపికల్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లుక్ లోకి మారిపోయాను. ఇప్పుడున్న కపుల్స్ లో సంతాన సమస్య ఎక్కువగా ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతి పది జంటల్లో మూడు జంటలు ఇన్ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. వారందరూ ఈ సినిమాతో రిలేట్ అవుతారు. సంతాన లేమి అనే సమస్యను మేము ఎక్కడా కామెడీ చేయలేదు. వాళ్లను గేలి చేయలేదు. ఆ సమస్య చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ డిజైన్ చేశాం. కాబట్టి ఎవర్నీ కించపరిచినట్లు ఉండదు. పైగా ఈ సినిమా చూశాక ఇన్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నా వారికి ఒక హోప్ కలుగుతుంది.
  • మంచి మూవీస్ చేసి పేరు తెచ్చుకున్న చాందినీ మా చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. చాందినీ, నేను కొన్ని సీన్స్ వర్క్ షాప్ చేసి సెట్ మీదకు వెళ్లాం. నా క్యారెక్టర్ తర్వాత చాందినీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ సినిమాలో కీలకంగా ఉంటాయి. తరుణ్ భాస్కర్ నా అభిమాన దర్శకుడు. ఆయన ఈ సినిమాలో జాక్ రెడ్డి రోల్ చేశారు. తరుణ్ భాస్కర్ గారితో కలిసి నటించడం మర్చిపోలేను. సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్ ఫాదర్ రోల్ లో మురళీధర్ గౌడ్ నటించారు. ఆయన తన కూతురును ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ చాందినీ నన్ను ప్రేమిస్తుంది. మేము ప్రెగ్నెన్సీ విషయంలో వంద రోజుల ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు కొత్త జంటలు మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పేవారట. ఇప్పుడు ఆ టైమ్ 19 నెలలకు పెరిగిందని ఒక సర్వేలో తేలింది. అంటే మనం లైఫ్ లో స్ట్రెస్, పరుగుల వల్ల, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాల వల్ల పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవడమో లేదా పిల్లల్ని కనే సామర్థ్యం తగ్గిపోవడమో జరుగుతోంది.
  • మా మూవీ షూటింగ్ త్వరగా పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ కు టైమ్ పట్టింది. సునీల్ కశ్యప్ గారు ఇతర ప్రాజెక్ట్స్ లో బిజిగా ఉండటం వల్ల బీజీఎం అజయ్ అరసాడ చేశారు. ఆయన చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. దాంతో పాటు తెలుసా నీ కోసమే సాంగ్ కూడా కంపోజ్ చేశారు. మా సినిమాలో పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. మా సినిమాకు ఓటీటీ రిలీజ్ కోసం మంచి ఆఫర్స్ వచ్చాయి. సినిమా బాగుండటంతోనే ఓటీటీలు తీసుకునేందుకు ముందుకొచ్చాయి.
  • సినిమాలో సాంగ్స్, ఫన్ అన్నీ ఆర్గానిక్ గా కుదిరాయి. ఏదీ కావాలని తీసుకొచ్చి ఇరికించినట్లు ఉండదు. సెన్సార్ నుంచి కూడా మాకు ప్రశంసలు వచ్చాయి. యుఎ సర్టిఫికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టే డైరెక్టర్ సంజీవ్ గారు సినిమాను ఎంత సెన్సిటివ్ గా డీల్ చేశారో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా పలు చోట్ల ప్రీమియర్స్ వేశాం. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడలేదని ఆడియెన్స్ మా దగ్గరకు వచ్చి చెప్పడం హ్యాపీగా అనిపించింది.
  • ఈ సినిమా తర్వాత శ్రీధర్ గారి బ్యానర్ లోనే దర్శకుడు సంజీవ్ రెడ్డితో సర్పంచ్ అనే మూవీ చేయబోతున్నా. గ్రామీణ నేపథ్యంగా సాగే చిత్రమిది. ఈ కథలోనూ కొన్ని సోషల్ ఇష్యూస్ చెబుతున్నా, ఈ చిత్రంలో లాగా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో వెళ్తున్నాం. మృత్యుంజయ మార్కండేయ అనే మరో సోషియో ఫాంటసీ మూవీకి ప్రయత్నాలు చేస్తున్నాం.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

22 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago