ఘనంగా హాస్య మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం.7, హీరో కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ ప్రారంభం

Must Read

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆయన కెరీర్‌లోనే ‘క’ సినిమా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తరువాత కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా చేస్తారు? ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు? అన్న కుతుహలం ఆడియెన్స్‌లో పెరిగిపోయింది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్ట్ అప్డేట్ వచ్చింది.

‘సామజవరగమన’, ‘ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత హాస్య మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 7గా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌కి ‘K-ర్యాంప్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ‘K-ర్యాంప్’ సినిమాకు కొత్త డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ సినిమాకు పూజా కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ పాల్గొన్నారు.

తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తుంటే నిజంగానే ర్యాంప్ ఆడించేలా ఉన్నారు. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్‌లా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరంను పూర్తిగా చూపించలేదు గానీ.. చుట్టూ ఆ మందిని చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేసినట్టుగానే ఉన్నారు. టైటిల్ లోగోలో ఉన్న ఆ బొమ్మ, ఆ మందు సీసా, ఆ ఫుట్ బాల్‌ను చూస్తుంటే అందరిలోనూ ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. కథ ఏమై ఉంటుందా? అనే చర్చలు లేవనెత్తేలా ఈ టైటిల్ పోస్టర్‌ ఉంది.

ఈ “k- ర్యాంప్”లో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది . ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సతీష్ రెడ్డి మాసం కెమెరామెన్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా, ఆర్ట్ డైరెక్టర్ గా సుధీర్ మాచర్ల, పృథ్వీ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : హాస్య మూవీస్
నిర్మాత : రాజేష్ దండ
సహ నిర్మాత : బాలాజి గుట్ట, ప్రభాకర్ బురుగు
రచన, దర్శకత్వం : జైన్స్ నాని
సంగీతం : చేతన్ భరద్వాజ్
కెమెరామెన్ : సతీష్ రెడ్డి మాసం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్ : చోటా కె. ప్రసాద్
యాక్షన్: పృథ్వీ
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్వో : వంశీ శేఖర్ – జి.ఎస్.కె మీడియా
డిజిటల్ మార్కెటింగ్ : హాష్ టాగ్ మీడియా

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News