“తన పట్టుదల, ఆకుంఠీత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను చేస్తూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారనే నానుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నిజం చేస్తున్నారన్నారు: రాజ్యసభ సభ్యులు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్”.తన కలంతో ప్రపంచం మెచ్చిన బాహుబలి, RRR వంటి పాన్ వరల్డ్ సినిమాలను మనకు అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలా తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు.
“వారసత్వ సాంస్కృతిక వైభవం, అధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా” డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ఉందంటూ ఆయన ప్రభుత్వాన్ని ప్రసంసించారు.
“ఇప్పుడే ఒక అద్భుతం చూసాను. వేరే ఎవరు చెప్పినా నమ్మేవాన్ని కాదు స్వయంగా చూసాను. అతి తక్కువ సమయంలో.. అతి తక్కువ బడ్జెట్ లో జనం కోసం ఒక గొప్ప నిర్మాణం చేసారు.
నిజంగా చెప్పాలంటే కేసిఆర్ గారు ఒక మిరాకిల్ క్రియేట్ చేశారు.. అది ఆయనకే సాధ్యం. పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ఒక గొప్ప ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయం. ఇది అందరికి ఉపయోగపడే నిర్మాణం. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉన్నానంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు విజయేంద్ర ప్రసాద్.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ co-founder రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు
Young and talented hero Kiran Abbavaram is starring in the upcoming film Dilruba, with Rukshar…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్…
There is a growing demand for films that delve into intense love stories, especially among…
యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్…
Tollywood hero Nithin in the lead role and directed by SS Rajamouli, the sports action…
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్…