డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా పాటలు అయితే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి.
ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు.
జూన్ 27న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…